జల్..జమీన్…జంగిల్ నినాదంతో ఏకమైన గిరిజనం..అటవీ భూములపై హక్కులు కల్పించాలంటూ ఇంద్రవెల్లిలో ఆదివాసీల సభ నిర్వహణ. సభకు అనుమతి లేదంటూ గిరిజనులపై విరుచుకుపడిన పోలీసులు. గిరిపుత్రులపై తుటాల వర్షం. 100 మందిపైగా అటవీ పుత్రులు నేలకొరిగారు. ఈ ఘటనకు( 20-04-1981)నేటితో 40 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 40ఏళ్లు అయినా ఇంద్రవెల్లి బాధితులకు న్యాయం జరగకపోవడం దారుణమని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు అండగా లేకపోతే మరో ఇంద్రవెల్లి సంఘటనకు దారితీయొచ్చని చెప్పారు. సీఎం కేసీఆర్ స్పందించకుంటే ఇంద్రవెల్లి బాధితులకు, అడవి బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Must Read ;- అడవి బిడ్డలపై అటవీ అధికారుల దాష్టీకం.. నలుగురి పరిస్థితి విషమం