సుప్రీమ్ హీరో , మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ .. తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. కొత్త కుర్రోడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.యస్.యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో ఇస్మార్ట్ పోరీ నభా సటేశ్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈసినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు.. సాయిధరమ్ తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని అమృతా అంటూ సాగే .. లిరికల్ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఈ పాట విరహగీతమని సాయిధరమ్ తేజ .. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘బల్బు కనిపెట్టినోడికే బ్రతుకు సిమ్మ చీకటైపోయిందే.. సెల్లు ఫోను కంపెనోడికే సిమ్ కార్డే బ్లాకై పోయిందే.. రూటు చూపే గూగులమ్మనే ఇంటి రూటునే మరచిపోయిందే.. రైటు టైము చెప్పే వాచ్ కె బ్యాడ్ టైమే స్టార్టైపోయిందే..’ అంటూ సాగిన ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్యాచీ ట్యూన్ అందించాడు. ‘అగ్గిపుల్లనే నేను మెల్లగా కాల్చుతుంటే.. సొంత కొంపనే ఫుల్లుగా పెట్టుకున్నాదే.. పాస్ట్ లైఫ్ లో నేను చెప్పిన ఎదవ మాటే బ్రైట్ ఫ్యూచరే నీలా తగలబెట్టిందే.. ఒగ్గేసిపోకే అమృతా నేను తట్టుకోలేక మందు తాగుతా.. ఒట్టేసి చెప్తున్నా అమృతా నువ్వెళ్ళిపోతే ఒంటరిపోతా.. ‘ అంటూ అమృతా తన జీవితంలో నుండి వెళ్లిపోయిన సందర్భంలో హీరో పాడుకుంటున్నాడు. ఈ పాటను కాకర్ల శ్యామ్ రాయగా.. యంగ్ సింగర్ నకాష్ అజీజ్ ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
లిరికల్ సాంగ్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి..











