గూగుల్ సహాయంతో అమెరికాలో ఉంటూ భారత దేశంలో ఉన్న తన తండ్రిని కాపాడుకున్నాడు ఓ యువకుడు. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 63ఏళ్ల కైలాష్ చంద్ర పారిక్ ఇండోర్ లో గత కొన్నేళ్లుగా ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. 63ఏళ్ల చంద్ర పారిక్ కు స్థానిక బీజేపీ నాయకుడికి బంధువుతో ఆయనకు తాజాగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో చంద్మల్ పారిక్ అనే యువకుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కైలాష్ చంద్ర పారిక్‌తో గొడవకు దిగాడు.సరిగ్గా అదే సమయంలో కాలిఫోర్నియాలో ఎంఎస్ చదువుతున్న అంకిత్.. తన తండ్రి కైలాష్ చంద్ర పారిక్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు.ఈ నేపథ్యంలో తన తండ్రిపై చంద్మల్ పారిక్ దాడికి యత్నించడాన్ని గమనించిన అతనిపై అంకిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే గూగుల్‌లో ఇండోర్ పోలీసుల ఫోన్ నెంబర్ వెతికి పోలీసులకు సమాచారం అందించాడు.అంకిత్ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చంద్మల్ పారిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో అంకిత్ చూపిన సమయ స్పూర్తికి పోలీసులు సైతం హర్షం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వీరల గా మారింది.
Must Read:-సౌకర్యాలతో పాటు రిస్క్‌లూ చాలా.. స్మార్ట్ ఫోన్ల వాడకంలో జర భద్రం











