గతంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి వంటి వారెందరో నెగటివ్ పాత్రలు చేసి ఆ తర్వాత హీరోలుగా తమ సత్తా చాటుకున్నవారే. ఇప్పుడు ఆ కోవలో విలన్ పాత్రధారి సోను సూద్ హీరో అవతారం ఎత్తబోతున్నారు. కోవిడ్ సమయంలో వలస కార్మికులను సొంతూళ్లకు తన సొంత నిధులను వెచ్చించి పంపించడంతో పాటు ఎందరికో సాయపడుతున్న సోనూను రియల్ హీరోగా ప్రేక్షకులు అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే.
దాన కర్ణుడిగా పిలవబడుతున్న ఆయన ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడట. దాంతో ఆర్ధిక అవసరాల కోసం ఇటీవల ముంబైలోని తన ఇంటిని సైతం ఆయన తాకట్టు పెట్టారు కూడా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉండే ఆయన తాజాగా చిరంజీవి “ఆచార్య” చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సందర్భంగా సోనూ స్పందిస్తూ, “హీరోగా అవకాశాలు వస్తున్నందున ఇకపై విలన్ పాత్రలు చేయకూడదని అనుకుంటున్నాను ఇప్పటికే హీరోగా నటించమంటూ నాలుగు కథలు నా దగ్గరకు వచ్చాయి. అందుకే హీరోగా నటించాలని నిర్ణయించుకున్నాను” అని అన్నారు. ఇదిలావుండగా, “ఆచార్య” చిత్రంలో సన్నివేశాల పరంగా తనను తన్నాల్సి వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి చాలా ఇబ్బంది పడ్డారని సోను చెప్పుకొచ్చారు. ప్రజల మనసులో ఎంతో స్థానం సంపాదించుకున్న నిన్ను సినిమా సన్నివేశం అయినప్పటికీ తన్నడం బాధగా ఉందని చిరంజీవి అన్నారని సోనూ వివరించారు ప్రస్తుతం తను అంగీకరించిన సినిమాలు పూర్తయితే.. ఆ తర్వాత సోనూ ను హీరోగానే చూడవచ్చు.
Thank you @SonuSood You are one of the finest human beings. Keep up your amazing work to help the needy & keep inspiring lakhs more. More power to you! You deserve all the recogntion for your golden heart! https://t.co/cjQQoeOUZY
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 20, 2020











