పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాంటిది ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా నటించడం ఏంటి అనుకుంటున్నారా..? మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన తమన్నా నటించలేదు. అలాగే ఈ మూవీలో వీరిద్దరికి స్పెషల్ సాంగు లేదు.
అయితే.. ఈ సినిమాలో మాస్ ని మెప్పించేలా పాటలు పెట్టలేదు. అందుచేత ప్రమోషనల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మాంచి మాస్ బీట్ రెడీ చేశాడట. ఆ పాటను తమన్నాతో చేయించాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ సాంగ్ సినిమాలో లేకపోయినా.. సినిమా రిలీజ్ కి రెండు వారాలు ముందుగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. అలాగే ఈ పాటను సినిమా చివరిలో పెట్టాలి అనుకుంటున్నారని తెలిసింది. ఈ పాటకు సంబంధించి డిష్కసన్స్ జరుగుతున్నాయి.
ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. పవన్ ప్రస్తుతం అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు. అయితే.. పవన్ రెండు మూడు గంటలు టైమ్ ఇచ్చినా సరిపోతుందని.. పవన్, తమన్నా కలిసి స్టెప్పులు వేస్తే.. వకీల్ సాబ్ కి మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ ఆలోచన. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ టీమ్ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.