సమంత అక్కినేని ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. మరో వైపు వెబ్ సిరీస్ ల్లోను నటిస్తూ దూసుకెళుతున్న స్టార్ హీరోయిన్. ఓ బేబి సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించి క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో బిగ్ సక్సస్ సాధించింది. ఈ సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి గుణ శేఖర్ తెరకెక్కించనున్న హిస్టారికల్ మూవీ శాకుంతలంలో నటించేందుకు ఓకే చెప్పింది.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. మరో వైపు సమంత నటించిన వెబ్ సిరీస్ ది ప్యామిలీ మ్యాన్ 2 విడుదలకు రెడీ అవుతుంది. సమ్మర్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. అలాగే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ సినిమాలో కూడా నటిస్తుంది. ఇటీవల సామ్ జామ్ పొగ్రామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ షోతో ఆకట్టుకుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత మరో మైలురాయి చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత అక్కినేనిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 15 మిలియన్స్‌కు చేరింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో సమంత తెలియచేస్తూ.. ఇప్పుడు షూటింగ్‌ను పూర్తి చేశాను. ఇన్‌స్టాలో 15 మిలియన్స్ ఫాలోవర్స్‌తో నాకు సర్‌ప్రైజ్ వచ్చింది. లైకులు, కామెంట్స్‌తో నన్నెంతో ప్రోత్సహించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ థ్యాంక్స్. మీ వల్ల మరింత ఉన్నతంగా పని చేయాలనే ఫీలింగ్ వచ్చింది. లవ్యూ యు ఆల్ అంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకుంది.
Must Read ;- సరికొత్త రికార్డ్ సాధించిన సమంత అక్కినేని











