తన అందం, అభినయంతో ఆకట్టుకుని.. అనతికాలంలోనే అందరి మనసులు దోచుకుని తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత. ఓ వైపు సినమాల్లో నటిస్తూనే మరో వైపు హోస్ట్ గా కూడా చేస్తుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓటీటీ ఫ్లామ్ ఫామ్ అయిన ఆహా కోసం.. సమంత సామ్ జామ్ అనే టాక్ షో చేస్తుంది. ఈ షోకు గాను సమంతకు 1.5 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఈ టాక్ షోలో ఇప్పటి వరకు చిరంజీవి, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, తమన్నా, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ క్రిష్, నాగ్ అశ్విన్‌లు తదితరులు పాల్గొన్నారు.
అయితే.. ఈ టాక్ షోను 8 ఎపిసోడ్లతోనే ఎండ్ చేసేస్తున్నారట. అదేంటి.. అప్పుడే ఎండ్ చేసేయడం ఏంటి.? అనుకుంటున్నారా..? ముందుగా ఫస్ట్ సీజన్ లో 10 ఎపిసోడ్ లు ప్లాన్ చేశారట. లాస్ట్ ఎపిసోడ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయాలి అనుకున్నారట. అయితే.. షూటింగ్ లు స్టార్ట్ అవ్వడంతో హీరోలందరూ బిజీ అయ్యారు. అందుచేత ఈ టాక్ షోకి గెస్ట్ లను పిలవడం అనేది కష్టంగా మారిందట.
అందుచేత 8 ఎపిసోడ్ లకే ఎండ్ చేసేయాలని ఫిక్స్ అయ్యారట. అంతే కాకుండా.. ఈ టాక్ షో ఓటీటీలో మాత్రమే ప్రసారం అవుతుండడతో వీక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉందట. అందుకే ఈ షోను ఆపేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక లాస్ట్ ఎపిసోడ్ ను స్పెషల్ గా ప్లాన్ చేయాలని.. సమంత భర్త నాగచైతన్యతో ప్లాన్ చేశారట. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేయడం కూడా జరిగింది. మరి.. సామ్ జామ్ సెకండ్ సీజన్ ఉంటుందో లేదో చూడాలి.
Must Read ;- సమంత విలన్ గా మరో రకం హాట్ గురూ