తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘‘యువగళం’’ పాదయాత్ర 100రోజుల మైల్ స్టోన్ అధిగమించింది. 100రోజుల్లో 1268కిమీ పాదయాత్ర పూర్తి ఒక ఎత్తయితే, 34నియోజకవర్గాలు, 80మండలాలు, 500గ్రామాల్లో సాగిన యాత్ర ఆయా ప్రాంతాల్లో సృష్టించిన రాజకీయ ప్రకంపనలు తెలిసిందే..32బహిరంగ సభల్లో, 82ముఖాముఖీ సమావేశాల్లో లోకేశ్ ప్రసంగాలు అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల్లో భరోసా నింపాయి, భవిష్యత్ పై నమ్మకాన్ని పెంచాయి.
అమ్మ కోసం.. అమ్మకిచ్చిన మాట నిలబెట్టడం కోసం..అమ్మ గౌరవం కాపాడటం కోసం..యువగళం సుదీర్ఘ పాదయాత్రకు నడుంకట్టిన చిచ్చరపిడుగు మన లోకేశుడు..ఎక్కడైతే తన తల్లికి అవమానం జరిగిందో అక్కడే ఆమె గౌరవ ప్రతిష్టలు పెంచడమే లక్ష్యంగా ముందడుగేస్తున్న నవయువ నాయకుడి లక్ష్యం నెరవేరాలన్నదే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బిడ్డ భావన..యువగళం 100రోజుల పూర్తి సందర్భంగా పాదయాత్రకు సంఘీభావంగా వచ్చిన కన్నతల్లి భువనేశ్వరమ్మకు తానే స్వయంగా షూలేస్ కట్టడం, కొడుకు వెంటే ఆమె అడుగేయడం టిడిపి శ్రేణులకది మధురానుభూతి మాత్రమే కాదు స్ఫూర్తిదాయక ఘట్టమైంది..100రోజులుగా తనకు దూరంగా ప్రతినిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందడుగేస్తున్న తనయుడ్ని చూసిన ఆనందం, 1268కిమీ యాత్రలో బొబ్బలెక్కిన అరికాళ్లను చూసి ఆవేదన ఆ తల్లితో దోబూచులాడాయి.
గత పాదయాత్రలకు భిన్నంగా లోకేశ్ ‘‘యువగళం’’ పాదయాత్ర ఎంతో వైవిధ్యంగా, వినూత్నంగా సాగడం విశేషం. పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు లోకేశ్ కు దోహదకారి కావడమే కాకుండా తెలుగుదేశం పార్టీ జైత్రయాత్రకు నాంది పలకడం విశేషం. యువగళం ప్రారంభం అయ్యాక ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 3స్థానాలను టిడిపి అభ్యర్ధులే ఘన విజయం సాధించడం గమనార్హం. తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టిడిపి బీసి అభ్యర్ధిని పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించడం ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.
లోకేశ్ పాదయాత్ర మున్నెన్నడూ కనీవినీ ఎరుగని సెల్ఫీ ఛాలెంజ్ లు, సెల్ఫీ సవాళ్లకు వేదిక కావడం మరో విశేషం. తన తాత ఎన్టీఆర్ తెలుగుగంగ (వెలిగోడు రిజర్వాయర్) తెచ్చారు, ఈ 4ఏళ్లలో నువ్వే ప్రాజెక్టు పూర్తిచేశావని, మా నాన్న చంద్రబాబు కియా కార్ల తయారీ పరిశ్రమ తెచ్చారు, నువ్వే కంపెనీ తెచ్చావ్ ఈ నాలుగేళ్లలో అంటూ లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ లు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.. టిడిపి హయాంలో చేసిన అభివృద్ధిని, వైసిపి వచ్చాక జరిగిన విధ్వంసాలను సెల్ఫీలుగా చూపించి లోకేశ్ సవాళ్లు విసరడం సమకాలీన రాజకీయాల్లో వినూత్న పోకడే.. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం వేసిన రోడ్లు, కట్టిన ఇళ్లు, పెట్టిన వీధి దీపాలు, నిర్మించిన ప్రభుత్వ భవనాలను, పూర్తిచేసిన నీటిపారుదల ప్రాజెక్టులను కళ్లకు కట్టినట్లు లోకేశ్ చూపడం ప్రజలపై చెరగని ముద్రవేసింది. ఈ విధంగా చూస్తే 100రోజుల్లోనే యువగళం పాదయాత్ర ప్రభావం ప్రజలపై గణనీయంగా పడిందనేది నిర్వివాదాంశం.
‘‘పాదయాత్రలో లోకేశ్ వేసిన ప్రతి అడుగు ప్రత్యర్ధులపై పిడుగే’’..అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో అక్కడి వైసిపి ఎమ్మెల్యే ఈ 4ఏళ్లలో చేసిన అవినీతి కుంభకోణాలను బైటపెట్టిన విధానం ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిందనడం అతిశయోక్తి కాదు. వైసిపి శ్రేణుల్లో ఈ యాత్ర మంట పుట్టిస్తోంది. లోకేశ్ పెట్టిన మంటలకైన గాయాలనెలా మాన్పుకోవాలో తెలీక వైసిపి ఎమ్మెల్యేలు గంగవెర్రులెత్తడం చూశాం..ఉదాహరణ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉదంతమే.. ఎర్రగుట్టపై 20ఎకరాలు ఆక్రమించి భవనాలు నిర్మించడాన్ని బట్టబయలు చేయడం పరిణామాలు విదితమే. గంగవెర్రులెత్తిన కేతిరెడ్డి మర్నాడు ఉదయాన్నే కృష్ణానది కరకట్టపైకి పరుగెత్తి ఉండవెల్లి గెస్ట్ హవుస్ ఫొటోలు తీయడమెలా బూమ్ రాంగ్ అయ్యిందో రాష్ట్రం యావత్తూ చూసింది. అదేకాదు చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ కుంభకోణాలను, పిఎల్ ఆర్ ట్రాన్స్ పోర్టు భాగోతాన్ని సెల్ఫీ ఛాలెంజ్ లతో బైటపెట్టడం మరో సంచలనం..
‘‘నేనేమీ టెర్రరిస్టునుగాను..తెలుగుదేశం వారియర్ ని..నా చుట్టూ ఇంతమంది పోలీసు బలగం ( 20మంది ఎస్సైలు, 10మంది సిఐలు, 6గురు డీఎస్పీలు, వజ్ర వాహనం..) ఎందుకయ్యా, జగన్ రెడ్డీ..? ఈ బలగాలను వేరేచోట్ల వాడితే, రాష్ట్రంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇంత బరితెగించేవా..? జగన్మోహన్ రెడ్డి సీమ బిడ్డ కాదు, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అనే విమర్శలతో అధికార పార్టీని గడగడలాడించాడు, ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించాడు. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారనే వ్యాఖ్యలపైనే ప్రతిచోటా చర్చోపచర్చలు సాగడం ఈ పాదయాత్ర సైడ్ లైట్లలో కొన్ని మాత్రమే..
యాత్రకు ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా అన్నింటినీ అధిగమించి ప్రజలకు చేరువయ్యాడు, తానేంటో ప్రజలకు ఎరుకపర్చాడు, పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగేందుకదే దోహదపడింది..యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల ప్రజలే రక్షణ సైన్యంగా మారి యువగళం పాదయాత్ర నిర్విఘ్నంగా సాగేందుకు తోడ్పాటు అందించడం మరో హైలెట్. ప్రజలను కలవనీకుండా, వారిని పలకరించనీకుండా, ప్రసంగించనీకుండా, చివరికి అడుగేయనీకుండా అధికార పార్టీ సృష్టించిన ఆటంకాలు అన్నీఇన్నీకావు.. గతంలో ఏ పాదయాత్రలోనూ ఇలాంటి దుందుడుకు చర్యలు లేవు, ఏ నాయకుడూ ఇంత అణిచివేతను ఎదుర్కొన్న దాఖలాలు లేవు..మొక్కవోని పట్టుదలతో, చెరగని ఆత్మవిశ్వాసంతో లోకేశ్ వాటన్నింటినీ అధిగమించి ప్రజలతో మమేకమైన తీరు నిజంగా కొనియాడదగింది..100రోజుల్లో లక్షన్నరమందితో సెల్ఫీలు దిగడం నిజంగా గిన్నెస్ రికార్డులకెక్కే అంశమే..రాబోయే 300రోజుల్లో ఈ సెల్ఫీల సంరంభం ఎంతకు చేరుకుంటుందనేది వేచి చూడాల్సిందే..
ప్రతిరోజూ ప్రతిచోటా రైతులతో భేటీలు, చేతివృత్తులవారితో సమావేశాలు, బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలపై చర్చలు, వాటి పరిష్కారమార్గాల అన్వేషణ, ఆయా అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తామంటూ అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాలను లోకేశ్ సొంతం చేసుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం..యాత్ర 100కిమీ పూర్తైన ప్రతిచోటా శిలాఫలకాలను ఆవిష్కరిస్తూ, తానిచ్చిన హామీలను గుర్తుచేస్తూ ముందడుగేయడం ఆయన ఆత్మవిశ్వాసానికి, వాటి పరిష్కారంపై చూపిన చిత్తశుద్ధికి అద్దం పట్టింది..
యువగళం పాదయాత్రకు ముందు, పాదయాత్ర తర్వాతగా నారా లోకేశ్ ఎదుగుదల మారింది..ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా ఆయనపై ప్రత్యర్ధులు జల్లిన బురదను, చేసిన విమర్శలను పూర్తిగా కడిగేయడమే కాదు సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది. అన్నివర్గాల ప్రజలకు ఆయన్ను దగ్గరచేసింది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను పేరుపెట్టి పిలిచేంత దగ్గరతనాన్ని కల్గించింది. తెలుగుదేశం పార్టీ 41ఏళ్ల చరిత్రలో మరో సువర్ణాధ్యాయం నారాలోకేశ్ యువగళం. నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది, వెరసి 2024సాధారణ ఎన్నికలకు టిడిపి శ్రేణులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసేందుకు దోహదపడింది.
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...