కరోనా.. ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఎందరివో జీవితాలను అథఃపాతాళానికి తొక్కేసింది. మరెందరికో అసలు జీవితాన్నే లేకుండా చేసేసింది. ఈ ప్రళయానికి పేద, ధనిక అనే తేడానే లేదు. కొవిడ్ ఆగ్రహానికి ఎందరో స్టార్ల జీవితాలు సైతం బలైపోవాల్సి వచ్చింది. టెన్నిస్ స్టార్ ఏంజెలీనా గ్రావోక్ తన సంపాదన కోసం పక్కదారి పట్టిందని తెలుస్తోంది! ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెడెలీన్ రైట్ సైతం పోర్న్ స్టార్‌గా మారుతున్నట్టు ప్రకటిస్తోంది.

అమ్మేసుకుంటున్నారు..
లాక్డౌన్లో సంపాందిచడానికి అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆస్ట్రేలియన్ రేసర్ రేనీ గ్రేసీ. ఇప్పుడు అదే బాటలో ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ ఏంజెలీనా గ్రావోక్ చేరింది. టెన్నిస్ రంగంలో సంపాదిస్తున్నా.. తన టెన్నిస్ కెరీర్‌కు అదనంగా సంపాందించడానికి ఏంజెలీనా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దీంతో తన వ్యక్తిగత ఫొటోలను ‘ఓన్లీఫ్యాన్స్’ వెబ్సైట్‌కు అమ్మేసిందని కొన్ని వార్తాసంస్థలు నివేదించాయి. అయితే ఆ వెబ్సైట్ నుంచి ఏంజెలీనా ఎంతమొత్తం ఆర్జించిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
“రేసింగ్లో నేను సరైన ఫలితాలు సాధించలేకపోయాను. తద్వారా ఫండ్స్ తీసుకురాలేకపోయాను. నా వంతు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడం వల్ల నా కెరీర్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే పోర్న్‌స్టార్‌గా మారడం నా జీవితంలో జరిగిన మంచి విషయం. అది నాకు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. ఇలా జరుగుతుందని అనుకోనప్పటికీ, ఈ పనిని ఆస్వాదిస్తున్నాను. నా దగ్గరున్న పోర్న్ ఫొటోలు, వీడియోలు అమ్మి.. 30 ఏళ్ల ఇంటి లోన్‌ను కేవలం 12 నెలల్లో తీర్చబోతున్నాను. పోర్న్ గురించి నా కుటుంబానికి తెలుసు. ఈ విషయంలో మా నాన్న నాకు అండగా నిలిచాడు”
-రెనీ గ్రేస్, మాజీ రేసర్

అదేబాటలో మెడెలీన్ రైట్…
మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా రేసర్ రోనీ గ్రేసియా… అదేబాటలో ఆస్ట్రేలియాకి ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ ఏంజెలీనా గ్రావోక్ న్యూడ్ బిజినెస్ లోకి దిగిపోయింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో స్పోర్ట్స్ స్టార్ కూడా దిగింది. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెడెలీన్ రైట్.. పోర్న్ స్టార్‌గా మారింది. అయితే గత డిసెంబర్‌లో స్నాప్‌చాట్‌లో అశ్లీల వీడియోలు పంచుకుందన్న ఆరోపణలతో విచారణ జరిపిన ఛార్ల్‌టన్ క్లబ్ మెడెలీన్ రైట్‌పై వేటు వేసింది. దీంతో ఆదాయం కోల్పోయిన మెడెలీన్ పోర్న్ వృత్తిలో కొనసాగుతున్నట్లు ప్రకటించింది.











