ఏ చిన్న అవకాశం దొరికినా టాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడుతున్న హాట్ బాంబ్ శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాకపోవడాన్ని తప్పుబడుతూ శివాలెత్తిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. బోడి గుండులు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా? అని డైరెక్ట్ గా మెగాస్టార్ నే ప్రశించింది. ఉమ్మేస్తున్నారిక్కడ అంటూ ఆవేదన చెందిన శ్రీ రెడ్డి.. టాలీవుడ్ నటిని అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ ”ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూల స్తంభాన్ని కోల్పోయింది. ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్యా.. వెళ్లిపోయావా? అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరు. అయితే ఓ స్టేజ్ వచ్చాక అదే స్టార్స్ మళ్ళీ ఆయనను ఇబ్బందులు పెట్టడమే గాక.. ఆ గాన గంధర్వుడి మరణం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్కడు కూడా రాకపోవడం సిగ్గుచేటు.
మా అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు. రావాలనే ఉద్దేశ్యమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా? టాలీవుడ్ ప్రముఖులకు ఓ గౌరవం తెలియదు, ఓ పద్దతి తెలియదు. ఎప్పుడూ వేదికలపై కొట్టుకుంటూ నీచానికి దిగజారి పోయారు. మీకూ మరణం వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. చేసిన పాపాలకు అనుభవించి మరీ పోతారు ఒక్కొక్కరు. ఇక్కడికొస్తే కాదురా.. మీరు గుమ్మం దాటి బయటకొచ్చినా కరోనా వస్తుంది. తూ” అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
టాలీవుడ్ నుండి ప్రముఖులు ఎవరు బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు వెళ్లకపోయినా శ్రీరెడ్డి మాత్రం ఒక్క మెగాఫ్యామిలీనే ప్రశించడం మంచి పద్దతి కాదని సినిమా ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అభిమానులైతే ఒక అడుగు ముందుకు వేసి శ్రీరెడ్డికి పిచ్చి పట్టిందని తన మానసిక పరిస్థితి బాలేదని తనను అలా వదిలేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఈ హాట్ బాంబు శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.











