చిత్రపరిశ్రమలో రచయితలుగా పేరుతెచ్చుకున్నవారు దర్శకులుగా ప్రయోగాలు చేస్తున్నారు. అలాగే డాన్స్ మాస్టర్లుగా క్రేజ్ తెచ్చుకున్నవారు కూడా మెగాఫోన్ పడుతున్నారు. తేజ .. గుహన్ వంటి సినిమాటోగ్రఫర్లు కూడా దర్శకులుగా రంగంలోకి దిగుతున్నారు. అలా ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్ .. దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు .. ఆయన పేరే ‘సెల్వా’. దక్షిణాదిలోని అన్ని భాషల్లోని సినిమాలకు ఫైట్ మాస్టర్ గా ‘సెల్వా’ పనిచేశాడు. అలా ఇంతవరకూ 100 సినిమాలకిపైగా ఆయన ఫైట్ మాస్టర్ గా చేయడం విశేషం.
సెల్వా ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు .. నటుడు కూడా. అంటే ముఖ్యమైన పాత్రలను చేయలేదుగానీ, హీరోను ఎదుర్కునే విలన్ గ్యాంగ్ కి చెందినవాడిగా ఆయన చాలా సినిమాల్లో తెరపై కనిపించాడు. ఆయన డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఆయనకి తెరపై గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాంటి సెల్వా .. దర్శకుడిగా కూడా తన సత్తాను చాటుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. మంచి కథను రెడీ చేసుకున్న ఆయన, మెగాఫోన్ పట్టుకుని త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు.
సెల్వా ఫైట్ మాస్టర్ గనుక .. ఆయన ఎంచుకున్న కథ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబంధించినదే అని అంటున్నారు. తమిళ దర్శకులలో ఎ.ఎల్. విజయ్ కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన అందించిన స్క్రిప్ట్ తో సెల్వా సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. ఓ మాదిరి బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మిస్తున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి. తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించి .. తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో సెల్వా ఉన్నాడు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే అభిమానుల కోసం సెల్వా ఏ స్థాయిలో రిస్క్ చేస్తాడో చూడాలి మరి.
Must Read ;- ‘సలార్ ’లో ప్రభాస్ ఢీకొనే కొత్త విలన్ ఇతనే