సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్ర గంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న వెరైటీ లవ్ స్టోరీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోన్న రెండో సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా సుధీర్ బాబు కి 14వ సినిమా. ఈ మూవీ షూటింగ్ ఈరోజే మొదలైంది. ఈ సినిమా టైటిల్ ను ఈ రోజే ట్విట్టర్ లో విడుదల చేశారు. ఈ విషయాన్ని వెరైటీగా హీరో సుధీర్ బాబు.. ఓ వీడియో రూపంలో చెప్పి.. టైటిల్ ను రివీల్ చేశాడు.
ఇదివరకు ఇంద్రగంటి, సుధీర్ బాబు కలయికలో సమ్మోహనం, వి సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఈ సినిమా మూడోది. సమ్మోహనం తరహాలోనే దీన్ని కూడా ఓ సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఇంద్ర గంటి. బెంచ్ మార్క్ స్డూడియోస్ బ్యానర్ పై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లాపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ గీత రచన చేస్తున్నారు.
Feel the magic of love!! Keep ur eyes locked on #AaAmmayiGurinchiMeekuCheppali
⭐ing beloved @isudheerbabu & dazzling @IamKrithiShetty with #MohanaKrishnaIndragantihttps://t.co/Ra2WVh44SX@kiranballapalli @mahendra7997 @sudheercotton @benchmarkstudi5 @pgvinda #VivekSagar pic.twitter.com/e50LG0dfPy
— BARaju (@baraju_SuperHit) March 1, 2021