‘ఆచార్య’ సినిమా గురించి దర్శకుడు కొరటాల శివ హింట్ ఇచ్చేశారు. ట్విట్టర్ లో రామ్ చరణ్ ఫొటోను షేర్ చేసి ఆచార్య సిద్ధమవుతున్నాడు అంటూ ట్వీట్ చేశారు. దాని అర్థం ఇందులో చరణ్ పాత్ర పేరు సిద్ధ అట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇది. ప్రస్తుతం ఆ సినిమా ఆఖరి షెడ్యూల్ లో ఉంది. మే 13న ఈ సినిమాని విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గురుశిష్యులులా దీన్ని తెరకెక్కిస్తున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ కథను తయారు చేసినట్లు తెలుస్తోంది.
కొరటాల శివ షేర్ చేసిన ఫొటోలో రామ్ చరణ్ వెనుక నుంచి కనిపిస్తారు. లుక్ చూస్తుంటే ఇది కూడా నక్సలైట్ పాత్రనే పోలి ఉంది. రామ్ చరణ్ భుజం మీద చరణ్ చేయి కూడా ఉంది. ఈ ఫొటోకు చిరు కూడా తనదైన స్టయిల్ లో ట్వీట్ చేశారు. నా సిద్ధతో నేను సిద్ధం అంటూ చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుందా? లేదా ప్రత్యేక పాత్రలా ఉంటుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడులైంది. త్వరలో మరో అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది.
That beautiful moment when my boy became my Comrade .. on screen! నా 'సిద్ధ' తో నేను సంసిద్ధం!!@sivakoratala @MatineeEnt @KonidelaPro #Acharya https://t.co/wPwdN6FdER
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 1, 2021