అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మూడో సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఎప్పుడో లాంఛ్ అయినా.. దీని రెగ్యులర్ షూటింగ్ కు లాక్ డౌన్ బ్రేకులేసింది. ఏడు నెలలు అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కు ఇంకా సమయం రాలేదు. ఎట్టకేలకు నవంబర్ నెలలో ఈ మూవీ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ కాబట్టి.. ‘పుష్ప’ సినిమా లో ఎక్కువ భాగం దట్టమైన అరణ్యాల్లో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. దానికోసం ముందుగా కేరళ అడవుల్ని అనుకున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మారుడుమిల్లి అడవులే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చాడట సుక్కూ. నవంబర్ మొదటి వారంలో మారేడుమిల్లిలో పుష్ప షూటింగ్ ప్రారంభం కాబోతోందని వినికిడి.
మారేడుమిల్లిలో సరిగ్గా 100మందికి సరిపడేలా వసతి సౌకర్యాల్ని రెడీ చేస్తున్నారు. షూటింగ్ రెడీ అవడానికి వారం రోజుల ముందుగానే టీమ్ మెంబర్స్ క్వారంటైన్ లో ఉండాలి. ఆ తర్వాత కోవిడ్ టెస్టులు నిర్వహించి.. షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట. నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిగా మారేడు మిల్లిలోనే షూటింగ్ జరుగుతుందట. ఈ షెడ్యూల్లో కనీసం 25శాతం షూటింగ్ అయినా కంప్లీట్ చేయాలని సుక్కూ అనుకుంటున్నాడట. ‘ఆర్య, ఆర్య2’ తర్వాత బన్నీ, సుక్కూల కాంబినేషన్ లో రానున్న ‘పుష్ప’ హ్యాట్రిక్ హిట్ కొడుతుందని అభిమానుల్ని అంచనా వేస్తున్నారు.