బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ గణ్.. ఇప్పుడు రెండు భారీ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించనుండడం టాక్ ఆఫ్ ది ఇండియన్ స్ర్కీన్ అయింది. అందులో ఒకటి జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ అయితే…మరో చిత్రం ప్రభాస్ , ఓం రౌత్ ‘ఆదిపురుష్’ అవడం విశేషం. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ అభినయించబోతున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త బాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది.
ఇందులో శివుడి పాత్రలో అజయ్ దేవ్ గణ్ నటిస్తున్నారని అక్కడ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్త నిజమైతే ‘ఆదిపురుష్’ చిత్రానికి మరింత ఆకర్షణ యాడ్ అయినట్టే . ఇప్పటికే ప్రభాస్, రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సినీ ఇండ్రస్ట్రీలోనే తిరుగులోని స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమా సౌత్ లోనే కాదు, నార్త్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ లో మాములుగా లేదు. ‘ఆదిపురుష్’ సినిమాకు ప్రధాన బలం ప్రభాస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మరో పక్క సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ లో మంచి పేరున్న సీనియర్, స్టార్ హీరో. సైఫ్ కూడా ‘ఆదిపురుష్’ చిత్రానికి మరో బలం. ఇక దీనికి అజయ్ దేవ్ గణ్ కూడా జత కలిస్తే ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అజయ్ దేవ్ గణ్ అటు సినిమాలతో ఇటు వ్యాపారంతో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’లోని తన పాత్రపై వస్తున్న వార్తలపై అజయ్ దేవ్ గణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.











