వైల్డ్ డాగ్ నాగార్జున ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైపు చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ సర్ ప్రైజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నది ఎవరో కాదు పాపులర్ యాంకర్ సుమ. దీని ప్రోమోను ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది. బిగ్ బాస్ 4లో ఈరోజు ఎలిమినేషన్ ఊహించినట్టు గానే జరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్టుగానే అమ్మ రాజశేఖర్ హౌస్ నుంచి వచ్చేసినట్టు సమాచారం ఉంది. స్టార్ మా విడుదల చేసిన సుమకు సంబంధించిన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీని నాగ్ ఆహ్వానించడం, సుమ తన సూట్ కేసులో ప్రత్యక్షం కావడం జరిగిపోయింది. ఇది నిజమేనా లేదా ఇందులో ఏదైనా ట్విస్ట్ ఉందా అన్న అనుమానం కూడా తలెత్తుతోంది. సుమ హౌస్ లోకి అడుగు పెడితే ఆ సొగసు మనకు చూడతరమా. ఇప్పటికే బిగ్ బాస్ 4కు టీఆర్పీ అంతగా రాలేదనుకుంటున్న తరుణంలో సుమ ఎంట్రీ ఇచ్చిందంటే మంచి బజ్ వచ్చేసినట్టే. షోకి కిక్ తెప్పించడంలో సుమ తర్వాతే ఎవరైనా. ఈ సీజనులో ఇప్పటికే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లో అడుగుపెట్టారు.
మొదట కుమార్ సాయి, ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్ అవినాష్, మూడో ఎంట్రీతో స్వాతి దీక్షిత్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 9వ వారం నడుస్తోంది. ఇప్పటిదాకా నాలుగో ఎంట్రీ మంగ్లీ అన్న ప్రచారం సాగింది. సడన్ గా సుమ ప్రత్యక్షమైంది. ఇందులో ఎన్ని పంచ్ లు ఉంటాయో ప్రోమో చూస్తుంటేనే అర్థమవుతోంది. సుమను తన చిన్నప్పటి నుంచి చూస్తున్ననని అవినాష్ అనగానే నాగ్ స్పందించేశారు.
‘ఊరుకో నేను నా చిన్నప్పటి నుంచీ చూస్తున్నా’ అంటూ పంచ్ వేశారు. తన తండ్రితో కూడా అనేక కార్యక్రమాలు చేసిన సుమ ఇప్పటికీ అలానే ఉందంటూ మరో పంచ్ వేశారు. సుమ తక్కువ తింటుందా.. తను కూడా రెచ్చిపోయి మరీ పంచ్ లు వేసేసింది. ఈ రోజు ఎవరో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోతున్నారు కాబట్టి ఆ లోటు కూడా భర్తీ అయిపోయినట్టే. మొత్తానికి రాజశేఖర్ ఎలిమినేషన్ అయినట్లు మాత్రం తెలుస్తోంది.











