ప్రిన్స్ మహేష్ సకుటుంబ సపరివార సమేతంగా ఈరోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారండోయ్: భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, గారాల పట్టి సితారలతో ప్రిన్స్ మహేష్ బాబు విహార యాత్రకు వెళుతున్నట్లువంది. అందరినీ కెమెరాలు క్లిక్ మనిపించేశాయి. అక్క మంజుల పుట్టిన రోజున ప్రిన్స్ హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళుతున్నారా అన్న సందేహం కలగక మానదు. కరోనా కదా మొహానికి మాస్క్ వేసుకోవడం మాత్రం మరచిపోలేదు. ఓ పదిరోజులు దుబాయ్ ట్రిప్పు వేసుకున్నట్టు సమాచారం.
కరోనా సమయంలోనూ మహేష్ విహారానికి మాత్రం ఆటంకాలు లేనట్లే ఉంది. ఇక షూటింగుల మీద దృష్టి పెడితే బాగుంటుందని కూడా నెటిజన్లు కామెంట్లు చేసేస్తున్నారు. సర్కారు వారి పాట షూటింగ్ అమెరికాలో జరగాల్సి ఉంది. ఇదిగో అదిగో అంటూ ఆ షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. దుబాయ్ లో వీరు ఓ ఫంక్షన్ కు హాజరవుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు కుటుంబం మళ్లీ ఈ నెల 17న హైదరాబాద్ కు తిరిగివస్తుంది.












