మహేశ్ బాబు .. పరశురామ్ కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దుబాయ్ లో జరుగుతోంది. దుబాయ్ లో షూటింగును మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాన్ స్టాప్ గా చిత్రీకరిస్తున్నారట. ఎక్కడా .. ఏ నిమిషం వృథా కాకుండా చూస్తున్నారని తెలుస్తోంది. మహేశ్ బాబు .. ఇతర ప్రధాన పాత్రలు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లో మహేశ్ బాబు – కీర్తి సురేశ్ పై ఒకటి రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.

మహేశ్ బాబు గత మూడేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ మూడేళ్లలో ఆయన సినిమాలు ఒకదానికి మించిన విజయం మరొకటి సాధిస్తూ వచ్చాయి. దాంతో ఆ కంటిన్యుటీ దెబ్బ తినకుండా కథల విషయంలో మహేశ్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యువ దర్శకులకు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టిన మహేశ్ బాబు, అనిల్ రావిపూడి ఇచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్ హిట్ కొట్టేశాడు. దాంతో ఆ తరువాత అవకాశాన్ని పరశురామ్ కి ఇచ్చాడు. ‘గీత గోవిందం’ సినిమాను పరశురామ్ నడిపించిన తీరు నచ్చే ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు.
అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సమయంలో పరశురామ్ తన స్క్రిప్ట్ విషయంలో మరింత కసరత్తు చేస్తూ, తన ప్లానింగును కూడా టైట్ చేసేశాడు. అంతే కాకుండా అయిన ఆలస్యం ఎలాగూ అయింది. అందువలన ఇకపై తమ వైపు నుంచి ఆలస్యం జరగకూడదని పరశురామ్ కి మహేశ్ బాబు చెప్పాడట. అందువలన ఎక్కడ కూడా జాప్యం జరగకుండా పరశురామ్ షూటింగు కానిస్తున్నాడని అంటున్నారు. పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.











