వైసీపీ కుట్రల కారణంగా BCలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ..కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా..చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. చట్టసభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే తమ నైతిక విధానమని తేల్చిచెప్పిన కూటమి నాయకత్వం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపాదించిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగా అంటే ఏకంగా 34 శాతం టికెట్లను బీసీ అభ్యర్థులకే స్వచ్ఛందంగా కేటాయించాలని తుది నిర్ణయం తీసుకుంది.
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ బీసీలను తమ పార్టీకి వెన్నెముకగా భావిస్తూ వచ్చింది. గతంలో టీడీపీ హయాంలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు రాజకీయ అధికారంతో పాటు సామాజిక ఎదుగుదల దక్కకూడదనే కుట్రపూరిత ఆలోచనతో ఆ రిజర్వేషన్లను 24%కి తగ్గించి తీవ్ర అన్యాయం చేసింది. నాటి వైసీపీ పాలకుల నిర్లక్ష్యం, వారు నమోదు చేసిన తప్పుడు గణాంకాలు మరియు బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసిన అంతర్గత కుట్రల వల్లే నేడు కోర్టుల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయనేది బహిరంగ సత్యం.
కోర్టుల పరిమితులు ఏవైనా తమ రాజ్యాంగబద్ధమైన, నైతిక సంకల్పాన్ని అడ్డుకోలేవని టీడీపీ స్పష్టం చేస్తోంది. కోర్టుల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్ల శాతం తగ్గినప్పటికీ, బి-ఫామ్ల పంపిణీలో 34% కంటే తగ్గకుండా బీసీ నాయకులకే స్వయంగా టికెట్లు కేటాయించి పోటీలో నిలబెట్టనుంది. కేవలం పోటీకే పరిమితం చేయకుండా వారి ఆర్థిక, సామాజిక మద్దతుకు పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో శ్రమించి బీసీల విజయాన్ని ఖాయం చేయబోతోంది.
వైసీపీ చేసిన రాజకీయ కుట్రలను తిప్పికొడుతూ, కేవలం మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయాన్ని నిరూపించిన చంద్రబాబు గారి నాయకత్వం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చట్టాలు పరిమితులు విధించినా, బీసీలకు దక్కాల్సిన రాజ్యాధికారాన్ని పార్టీ పరంగా ఇవ్వడానికే కూటమి కట్టుబడి ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో కూటమి ఎప్పటికీ ముందే ఉంటుందని మరోసారి నిరూపితమైంది.











