June 24, 2026 7:05 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

ఎవరు చస్తున్నారు? ఎవరు దొరుకుతున్నారు? ఎవరు స్మగ్లరు?

ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చిత్తూరు జిల్లా నుంచి జరుగుతూ ఉండే అత్యంత సర్వసాధారణమైన అకృత్యం. అయితే పోలీసు, ఫారెస్టు తనిఖీలు, దాడులు జరుగుతున్నప్పుడు పట్టుబడుతున్నది ఎవరు? బలవుతున్నది ఎవరు? ఇవి మనం దృష్టి సారించాల్సిన ప్రశ్నలు. 

November 2, 2020 at 6:15 PM
in Editorial, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుమల వేంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమల గిరుల చుట్టూతా ఉండే శేషాచలం అడవుల్లో విస్తారంగా పెరిగే ఎర్రచందనం అడ్డూ అదుపూ లేకుండా స్మగ్లింగ్ అవుతూనే ఉంటుంది. ఇది ఇవాళ మొదలైనది కాదు.. ఇవాళ అంతమయ్యేది కూడా కాదు. ప్రభుత్వాల్లో ఎవరున్నప్పటికీ.. ఎన్ని పోలీసులు దాడులు జరుగుతున్నప్పటికీ.. వందల సంఖ్యలో వాహనాలు సీజ్ అవుతున్నప్పటికీ.. అంతకు మించిన సంఖ్యలో వ్యక్తులు (ప్రధానంగా తమిళ స్మగ్లర్లుగా మనం వ్యవహరించే వారు) అరెస్టు అవుతున్నప్పటికీ.. స్మగ్లింగ్ కార్యకలాపాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

అయితే తాజాగా ఎర్రచందనం స్మగ్లర్లు వెళుతున్న వాహనాన్ని ఒక నకిలీ పోలీసుల ముఠా వెంటాడడం, నిజం పోలీసులే అనుకుని.. వారిని తప్పించుకునే ప్రయత్నంలో స్మగ్లర్ల వాహనం వేగంగా వెళుతూ.. అదుపు తప్పి టిప్పర్‌ను ఢీకొనడం ఆ ప్రమాదంలో నలుగురు దారుణంగా మరణించడంతో అందరి దృష్టి మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ వైపు మళ్లింది.

అసలేం జరిగింది..

కడపజిల్లా పరిధిలోకి వచ్చే అడవుల్లో ఎర్రచందనం నరిగిన స్మగ్లర్లు స్కార్పియో వాహనంలో వెళుతుండగా.. వల్లూరు మండలం గోటూరు వద్ద వెనుకనుంచి ఇటియోస్ కారులో కొందరు వెంటపడ్డారు. వారు పోలీసులు అని భావించిన స్కార్పియోలోని స్మగ్లర్లు వేగంగా నడుపుతూ.. అదుపు తప్పి.. టిప్పర్ ను ఢీకొన్నిరు. అది కూడా నేరుగా టిప్పర్ డీజిల్ ట్యాంకర్‌నే ఢీకొనడంతో మంటలు రేగి స్కార్పియో దారుణంగా దగ్ధమైంది. అందులో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే గుర్తు పట్టలేని విధంగా కాలిపోయారు. మరొకవ్యక్తి ఆస్పత్రిలో  మరణించాడు. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. అందులో 18 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గమనించారు.

అయితే ఈలోగా వారిని వెంబడించిన ముఠా కారు కూడా వచ్చి వారిని ఢీకొంది. ఆ కారులోని వారు పరారవగా ఒకరు మాత్రం పోలీసులకు దొరికాడు. ఇటియోస్ కారులో వెంబడించిన వారు నకిలీ పోలీసులుగా గుర్తించారు. వాళ్లు నిజం పోలీసులే అని భ్రమించి.. పారిపోయే ప్రయత్నంలోనే ప్రమాదం జరిగింది.

ఎర్రచందనం స్మగ్లర్ల ను వెంబడించిన ఇటి యోస్ కారు పెండ్లిమర్రి మండలానికి చెందిన ఒక  వ్యక్తికి చెందినది గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇటి యోస్ కారులోని వ్యక్తులు పారిపోయినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఒకే ఘటనలో రెండు నేరాలు..

జరిగింది ఒకటే దుర్ఘటన.. పోయింది అయిదు నిండు ప్రాణాలు.. కానీ రెండు నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి- ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే.. రెండు- నకిలీ పోలీసుల రూపంలో వారిని వెంబడించి వసూళ్ల దందా నడిపించే వ్యక్తులు. ఎర్రచందనం దొంగలు దొరికిన ప్రతిసారీ ఒకటో తరహా నేరం బయటపడుతూనే ఉంటుంది. దొరకని సందర్భాల్లో.. రెండో తరహా నేరాలు ఎన్నెన్ని గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయో ఎవరికీ తెలియదు. వాహనం దొరికింది.. దాన్ని బట్టి.. అసలు నకిలీ పోలీసుల అవతారమెత్తి ఇలా ఎర్రచందనం దొంగలనుంచి దందాలు చేస్తున్న వారెవరో పోలీసులు రాబట్టాలి.

ఈ స్మగ్లింగ్ ఆగదా?

ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది.. చిత్తూరు, కడప ప్రాంతాలకు చెందిన పోలీసుల, అటవీ అధికారుల అసమర్థతకు, లాలూచీ వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనంగా మనకు అనిపించే వ్యవహారం. స్మగ్లర్లు దొరికినట్టు, అరెస్టులు జరిగినట్టు, దుంగలు స్వాధీనం అయినట్టు, వాహనాలు సీజ్ చేసినట్టు ప్రతిరోజూ వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ స్మగ్లింగ్ ఆగినట్టు మాత్రం కనిపించదు. ఎందుకంటే.. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా సరే.. వారి అండదండలు స్మగ్లర్లకు ఉంటున్నాయనే భావన ప్రజల్లో ఉంది. ఎర్రచందనం స్మగ్లర్లకు ఆశ్రయం ఇస్తూ.. అండగా ఉంటూ.. కోట్లకు పడగలెత్తిన నాయకులు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు వీటిని సమర్థంగా అరికట్టిన దాఖలాలు మాత్రం లేవు.

అసలు స్మగ్లర్లలో భయం ఉండదా?

ఇటీవలి ఘటనల్ని పరిశీలిస్తే.. అసలు పోలీసు దాడులు స్మగ్లర్లలో కించిత్ మార్పు కూడా తేలేకపోతున్నాయా అనే అనుమానం కలుగుతుంది.

శుక్రవారం నాడు  తలకోన శేషాచల అటవీ ప్రాంతంలోని కాటుకాకనుమ వద్ద టాస్క్ ఫోర్స్ కూంబింగ్‌లో ఉండగా, సుమారు 50 స్మగ్లర్లు తారసపడ్డారు. నలుగురు తమిళనాడు వాసులను అరెస్ట్ చేసి 46 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

గురువారం నాడు.. యర్రావారిపాళ్యం మండలం శేషాచల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారుల కూంబింగ్ చేస్తుండగా.. ఇదే తలకోన సమీపంలోని నల్లమంద వద్ద  30 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారులను చూసి తమిళ స్మగ్లర్లు పారిపోగా.. 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అదే గురువారం నాడు.. కడప ఓబులవారిపల్లె మండలం వై కోట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారుల తనిఖీల్లో నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు చేశారు.

అదే రోజున- నెల్లూరు   జిల్లాలో 3 కోట్ల విలువ చేసే ఎర్రచందనం పట్టుకున్నారు. ఆత్మకూరులోని నెల్లూరుపాలెం చెక్ పోస్టు వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 194 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. లారీనీ వదిలేసి డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం పట్టుబడింది.

.. ఈ వరుస ఘటనలు చూస్తేనే.. అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎంత విచ్చలవిడిగా జరుగుతోందో తెలుస్తుంది. ఇవి బయటపడిన ఘటనలు మాత్రమే. అసలు చిక్కకుండా.. ఎంత విశృంఖలంగా స్మగ్లింగ్ జరుగుతోందో తెలియదు. స్మగ్లింగ్‌ను అరికట్టడం మాత్రమే కాదు. వారిని బెదిరించి సొమ్ము చేసుకునే నకిలీ పోలీసుల కతలు కూడా నిగ్గు తేల్చాలి. సోమవారం ఉదయం జరిగిన ఘోరప్రమాదం నేర్పుతున్న పాఠం ఇది.

వెనక ఉన్న వారెవ్వరు?

ఎప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ పట్టుబడినా తమిళనాడు స్మగ్లర్లు అనే మాటే మీడియాలో వస్తుంటుంది. నిజానికి వారు స్మగ్లర్లు కాదు. కూలీలు. తమిళనాడు కూలీలు మాత్రమే ఎందుకు దొరుకుతున్నారు. అసలు చిత్తూరు  జిల్లా ప్రాంతాల్లో తమిళనాడు కూలీల కదలికలు కనపడగానే.. పోలీసులు ఎందుకు అలర్ట్ కాలేకపోతున్నారు. ఇవన్నీ అనుమానాలే. విషయం ఏంటంటే.. తమిళ కూలీల్ని వాడుకుని… అక్రమ దందాలను నడిపిస్తున్నది స్థానిక ప్రాంతాలకు చెందిన నాయకులే. ఆ మూలస్తంభాలను పట్టుకోగలిగితేతప్ప.. ఎప్పటికీ ఈ ఎర్రచందనం అనేది ఆగే అవకాశం లేదు.

.. సురేష్ పిళ్లె

Tags: andhrapradesh governmentchittoor districtforest officialskadapa policeleotopmahindra scorpiored sandalred sanders smugglersred sanders smuggling casesandalwood smuggling in Indiaseshachalam biosphere reserveseshachalam forestsuresh pillaisuresh pillai editorialtirumalatoyota etiosvenkateswara temple
Previous Post

పవన్ – క్రిష్ సినిమాలో బాపుగారి బొమ్మ?

Next Post

మేజర్ సినిమా షూట్ కి ‘గూఢచారి’ హీరో రెడీ.. !

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

బాలు కోలుకుంటున్నారు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

విశాఖలో మరో ఐటీ పార్క్.. 200 ఎకరాల విస్తీర్ణంలో..!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist