పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తీసుకోని ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇందులో ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ నటించబోతుందని టాలీవుడ్ సమాచారం.
పవన్ – క్రిష్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాట ఉంటుందని, ఆ పాటలో పవన్ పాత్ర చేసే మంచి పనులను ఒక పాట రూపంలో చెపుతారని, ఆ పాట విన్న ఒక యువతి పవన్ పై మనసు పారేసుకుంటుందని, ఆ మనసు పారేసుకున్న యువతి పాత్రలో ప్రణీత నటించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రణీత, పవన్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించింది. ఆ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తోందట ప్రణీత. అందుకనే పవన్ సినిమా అనగానే ఏమి ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట అమ్మడు.
కాగా పవన్ – క్రిష్ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే సినిమా అని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు Pran‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారం లో ఉంది. అయితే ఈ టైటిల్ పై ఇప్పటివరకు చిత్ర బృందం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రణీత నటిస్తోంది అన్న వార్త నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.











