తమిళ హీరోలు తెలుగులో స్ట్రైయిట్ సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. కథా చర్చలు పూర్తయ్యాయి. త్వరలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. అలాగే తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో స్ట్రైయిట్ మవీ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా కథాచర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో ఓ భారీ నిర్మాణ సంస్థ ధనుష్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు హీరో సూర్య కూడా తెలుగులో స్ట్రైయిట్ మూవీ చేయనున్నారు. ఎప్పటి నుంచో సూర్య తెలుగులో సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ.. కథ కుదరకపోవడం వలన చేయలేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను సూర్య కోసం ఓ స్టోరీ రెడీ చేసారు. ఈ కథ సూర్యకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. సూర్య – బోయపాటి కాంబినేషన్ లో మూవీని దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. లాక్ డౌన్ టైమ్ లో బోయపాటి కొన్ని కథలు రెడీ చేశారు.
అందులో ఒకటి బన్నీ కోసం కాగా, మరొకటి సూర్య కోసం. అయితే.. బోయపాటి అఖండ తర్వాత బన్నీతోనే సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఒకవేళ బన్నీతో ప్రాజెక్ట్ వెంటనే కుదరకపోతే.. సూర్యతో సినిమాని స్టార్ట్ చేయాలనేది బోయపాటి ప్లాన్.