తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేశామనే కక్షతో తన భర్త కరకాటి మల్లిఖార్జునపై పది మంది వైసీపీ గూండాలు దాడి చేశారని గర్భణి రమ్య నెల్లూరు జిల్లా కొడవలూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తన భర్తపై దాడి చేయడమే కాకుండా, ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి అక్రమ కేసులు బనాయించారని రమ్య ఆందోళనకు దిగారు. తన భర్తపై రౌడీ షీట్ ఎందుకు తెరిచారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా..
నెల్లూరు జిల్లా ఎస్పీ తనకు వెంటనే న్యాయం చేయకుంటే పోలీస్ స్టేషన్ ముందే నిరాహార దీక్షకు దిగుతానని నిండు గర్భణి రమ్య హెచ్చరించింది. తన భర్త టీడీపీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేశాడనే కక్షతోనే దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. తన భర్త వైసీపీ నేతలకు ఎదురు నిలిచిపోరాటం చేస్తున్నాడని రమ్య మీడియా ముందు కన్నీటి పర్యతం అయ్యారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీని వీడేది లేదని ఆమె స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో నిండు గర్భణీలు కూడా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల ముందు దర్నాలు చేయాల్సి వస్తోందని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు.











