తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ను ఓ స్వామీజీ కలవడం చర్చనీయాంశమైంది. ఇటీవలే అనారోగ్యానికి గురై కోలుకుని చెన్నై చేరిన రజినీ కాంత్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. రజినీ మక్కల్ మండ్రమ్ తరఫున వచ్చే వారిని కూడా ఆయన కలవడం లేదు. రాజకీయ పార్టీ విషయంలోనూ ఆయన వెనుకంజ వేశారు. తాను పార్టీ పెట్టబోవడం లేదని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఓ స్వామీజీ ఆయనను కలిశారు. దాదాపు అరగంటపాటు ఆ స్వామీజీ రజినీ కాంత్ తో చర్చలు జరిపారు. రజినీని పరామర్శించేందుకు ఆయన వచ్చినట్టు చెబుతున్నారు. ఆ స్వామీజీ పేరు నమో నారాయణ స్వామి. రజినీ ఆరోగ్యం గురించి వాకబు చేసి రజినీకాంత్, లత దంపతులను ఆయన ఆశీర్వదించి వెళ్లిపోయారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.