టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే, హీరోగా అత్యంత పాపులారిటీ సంపాదించు కున్నాడు యంగ్ హీరో సత్యదేవ్. ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా రక్తికట్టించే టాలెంట్ అతడిది. ‘బ్లఫ్ మాస్టర్, 47డేస్, ఉమా మహేశ్వరా ఉగ్రరూపస్య’ లాంటి సినిమాలతో శభాష్ అనిపించుకున్నాడు. ఆ క్రెడిట్ తోనే అతడిప్పుడు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను కైవసం చేసుకున్నాడు. అందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ‘గుర్తుందా శీతాకాలం’ ఒకటి. కన్నడ సూపర్ హిట్ మూవీ లక్ మాక్ టైల్ సినిమాకిది రీమేక్ వెర్షన్. కన్నడలో సూపర్ హిట్టైన ఈ సినిమా కథ నచ్చడంతో మేకర్స్ .. దీన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
మొన్నామధ్యనే లాంచ్ అయిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని, సరిగ్గా రాని కారణంగా నిర్మాతలు దీన్ని ఆపేశారనే రూమర్స్ స్ర్పెడ్ అయ్యాయి. దాన్ని సత్యదేవ్ ఖండిస్తూ.. ఎంతో బాధపడ్డాడు. తన ఎదుగుదలను ఓర్వలేని కొందరు కావాలని ఈ రూమర్స్ ను క్రియేట్ చేశారని, నిజానికి ఈ సినిమా ఎంతో బాగా వస్తోందని .. తమన్నా హీరోయిన్ అవడం నిజంగా ఈ ప్రాజెక్ట్ కే చాలా అడ్వాంటేజ్ అని చెప్పాడు. దాంతో ఈ సినిమాపై వస్తోన్న రూమర్స్ కు చెక్ పెట్టినట్టైంది. ఇక సత్యదేవ్ తిమ్మరుసు అనే మరో ఆసక్తికరమైన సినిమాను కూడా ఈ మధ్యే ప్రారంభించాడు. అందులో అతడు ఓ వెరైటీ పాత్ర పోషిస్తున్నాడు.











