తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసైకు అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేదీని పదవి నుంచి తొలగించి, తమిళిసై సౌందర రాజన్‌కు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తెలంగాణా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆమె చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. గత కొంతకాలంగా పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేదీకి మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. అవి కాస్తా తారాస్థాయికి చేరడంతో, ఈనెల 10వ తేదీన రాష్ట్రపతిని కలుసుకున్న పుదిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను రీకాల్ చేయాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా కిరణ్ బేదీని తొలగించి, తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
Must Read ;- తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు!











