తెలాంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరిచారు. హైకోర్టు న్యాయవాదులు వామన రావు, నాగమణికి దారుణంగా నడిరోడ్డుపై దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో కూడా విధుల బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.
హైకోర్టు న్యాయవాదులు వామన రావు, నాగమణి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. చనిపోవడానికి ముందు వామన రావు కుంట శ్రీనివాసరావు పేరు చెప్పడంతో.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కులదేవత గుడికి సంబంధించిన వివాదమే, న్యాయవాదుల హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన వివారాలు, సాక్ష్యాలు సంపాదించడానికి కుంటా శ్రీనివాసరావు కాల్ డేటా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో అతనెక్కడున్నదీ అనే విషయాలు ఆరా తీస్తున్నారు. అంతేకాదు, వామన రావుకు వేరే శత్రువులున్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Must Read ;- దంపతులను నరికి చంపిన దుండగులు











