కరోనా వలన థియేటర్లు మూతపడడం.. డిసెంబర్ నుంచి 50 శాతం సిటింగ్ కెపాసిటీతో థియేటర్లు రీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా 50 శాతం సిటింగ్ కెపాసిటీతో థియేటర్ల రీ ఓపెన్ కి అనుమతి ఇవ్వడంతో థియేటర్లు ఓపెన్ చేసారు. అయితే.. 50 శాతం సిటింగ్ అంటే నిర్మాతకు లాభాలు రావని.. 100 శాతం సిటింగ్ కి అనుమతి ఇవ్వాలని కొంత మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
50 శాతం సిటింగ్ వలన కొన్ని సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. ఇదిలా ఉంటే.. తమిళనాడు ప్రభుత్వం 100 శాతం సిటింగ్ కి అనుమతి ఇచ్చింది. విజయ్ నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా థియేటర్లో 100 శాతం సిటింగ్ కి అనుమతి ఇవ్వాలని విజయ్ తమిళనాడు సీఎంను కలిసి విన్నమించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు తమిళనాడు ప్రభుత్వం అక్కడ థియేటర్స్ – సినిమాస్ – మాల్టీప్లెక్సులు 100 శాతం సీటింగ్ కి అనుమతులు ఇచ్చింది.
అయితే.. థియేటర్స్ లో కోవిడ్ సేఫ్టీ మేజర్స్ స్ట్రిక్ట్ గా పాటించాలని సూచించింది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. కోరోనా సెకండ్ వేవ్ వార్తలు వస్తున్న ఈ సమయంలో 100 శాతం సిటింగ్ కి పర్మిసన్ ఇవ్వడం విశేషం. తమిళనాడులో 100 శాతం సిటింగ్ కి పర్మిషన్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 శాతం సిటింగ్ కి పర్మిషన్ ఇవ్వాలనే డిమాండ్ పెరగడం ఖాయం. మరి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా థియేటర్లో 100 శాతం సిటింగ్ కి పర్మిషన్ ఇస్తాయా..? లేక కొన్నాళ్లు వెయిట్ చేయాలి అంటాయా..? అనేది ఆసక్తిగా మారింది.