ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్ట్ తరువాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తన కొంప తానే ముంచుకునే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నది అక్షర సత్యం.
ఎపి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టే ఇందుకు నిదర్శనం. 2021లో స్కిల్ డవలప్మెంట్ సంస్థలో స్కామ్ జరిగిందంటూ సిఐడి పోలీసులు కేసు నమోదుచేశారు. కొంతమందిని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. వారికి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఈ కేసు మారింది అన్నదానికి నిన్న హైకోర్టు తీర్పే చెంపపెట్టు. ఈ కేసులో సీఐడీ ప్రదర్శించిన అత్యుత్సాహంపై హైకోర్టు తలంటడం చర్చనీయాంశమైంది.
జైలులో బాబు ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ మంజూరు చేసినప్పుడు విమర్శలు గుప్పించారు. నిన్న సర్వోన్నత న్యాయస్ధానం చంద్రబాబుకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసినా.. దానిపై కామెంట్స్ మొదలుపెట్టారు వైసీపీ బ్యాచ్. బెయిల్ పిటిషన్ పై ఇచ్చిన తీర్పుపై, రాష్ట్ర సర్వన్నోత న్యాయం స్థానంపై, జడ్జీపై వైసీపీ మంత్రులు, సలదారులు విమర్శలు గుప్పించారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో విషప్రచారం మొదలుపెట్టారు. ఇది చాలదన్నట్లు హైకోర్టు బెయిల్ తీర్పు సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబును ఎలాగయినా జైలులోనే ఉంచాలన్న తలంపుతో ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిందన్నది క్లియర్.బాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు మరో ఐదు కేసులు నమోదుచేసింది. చంద్రబాబును అరెస్ట్ చేసి వైసిపి ప్రభుత్వం ప్రజల్లో చులకనైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ, జనసేనలు కలిసేలా పరిస్థితులు సృష్టించి జగన్ తన గొయ్యి తానే తొవ్వుకున్నాడని రాజకీయ విశ్లేషణలు సర్వత్ర ఊపందుకున్నాయి. దీంతో దిక్కుతోచని స్ధితిలో వాట్ నెక్స్ట్ అన్నట్లు వైసీపీ డిఫెన్స్ లో పడింది.
కేసులో భయపెట్టినా.. దాడిలతో గొంతు నోక్కాలన్నా.. చివరికి న్యాయస్థానాల్లో న్యాయమే గెలుస్తోందని.. న్యాయ పోరాటంతోనే జగన్ రెడ్డి అధికార మదాన్ని అణిచివేయడం సాధ్యమౌతోందని టీడీపీ శ్రేణులు క్లారిటీకి వచ్చాయి.