ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. పంచాయతీల ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులకు ఓట్లు వేయని వారి పింఛన్లు తొలగిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసారావు పేట మండలంలోని పమిడిపాడు గ్రామానికి చెందిన 150 మందికి, , అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని గోళ్ల, నార్పల మండలంలోని దుగుమర్రి, పెద్దవడుగూరు మండలంలోని మజరా కొండూరుకు చెందిన 500 మందికి పైగా టీడీపీ మద్దతుదారుల పింఛన్లు నిలిపివేశారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద బాధితులు నిరసన తెలిపారు.
పింఛన్ల జాబితా లోంచి 150 మంది పేర్ల తొలగింపు
ఇటీవల జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో పమిడిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడిని సర్పంచ్‌గా గెలిపించారు. దాంతో ఖంగుతిన్న వైసీపీ నాయకులు పమిడిపాడు గ్రామంలోని 150 మందికి పింఛన్లు నిలిపివేశారు. ఈనెల పింఛను రాకుండా అడ్డుకోవడమే కాకుండా పింఛన్ల జాబితా లోంచి 150 మంది టీడీపీ కార్యకర్తల, సానుభూతి పరుల పేర్లని తొలగించారు. దాంతో పమిడిపాడు గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్ కలెక్టర్‌కు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించకపోతే పింఛన్‌లు కట్ చేయడం ఏంటని ? ఇలాంటి వేధింపులు ఏ ప్రభుత్వ హయాంలో కూడా చూడలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకుల వేధింపులు తాళలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలంటూ పమిడిపాడు గ్రామస్థులు సబ్ కలెక్టర్‌ని వేడుకున్నారు.
Must Read ;- విజయవాడ టీడీపీ నాయకులపై చంద్రబాబు సీరియస్