ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేత నేలవెళ్లి రామారావు దారుణహత్యకు గురయ్యారు. కొందరు దుండగులు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయబడ్డారు నేలవెళ్లి. అప్రమత్తమైన కుటుంబ సభ్యలు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో చికిత్స పొందతూ రామారావు మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజేష్ అనే వ్యక్తిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు. కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక లావాదేవీలే కారణమంటున్న పోలీసులు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆర్థిక పరమైన కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. గతంలో రామారావు, రాజేష్ మంచి స్నేహితులు కావడం గమనార్హం. ఆర్థిక లావాదేవీల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు సమాచారం. ఆ గొడవ వల్లే రాజేష్ దాడి చేసి హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Must Read ;- వరంగల్, ఖమ్మంలపై కమల దళం కన్ను..