#PSPK31- నెట్టింట ఇదిప్పుడు వైరల్ కాబోతోంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మరి. పవర్ స్టార్ 30 వ సినిమాగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ అవుతోంది. మరి 31వ సినిమా ఎవరికి చేయబోతున్నారు? అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ PSPK31 ఎవరితోనో ఊహించుకోండి. ఇంకెవరు పూరి జగన్నాథ్ మరోసారి పవన్ కళ్యాణ్ తో 31వ సినిమా చేయబోతున్నారు. సినిమా వర్గాల్లో ఈ టాక్ ఎప్పటి నుంచో ఉంది. పైగా వవన్ కళ్యాణ్ సినిమాల దూకుడు పెంచారు కూడా.
పవన్, పూరి కాంబినేషన్ లో వచ్చే సినిమాకి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు నిర్మాత విషయంలో స్పష్టత లేదు. వకీల్ సాబ్ తో పాటు వరుసగా పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. పూరి జగన్నాథ్ తో మొదటిసారిగా ‘బద్రి’ సినిమాని పవన్ చేశారు. దాని తర్వాత ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చేశారు. బద్రి హిట్ అయినా రెండో సినిమా అంత ఫలితం ఇవ్వలేదు. అయితే పూరి మీద పవన్ కు నమ్మకం సడల లేదు. అసలు ఇంతకుముందే ఓ సినిమా చేయాల్సి ఉన్నా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సాధ్యం కాలేదు.
పవన్, పూరి సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కితే వీరి కాంబినేషన్ లో మూడో సినిమా అవుతుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో, విజయ్ దేవరకొండ (హీరోగా యాక్షన్ డ్రామా ‘ లైగర్ ’ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికావచ్చింది. అలాగే ‘రొమాంటిక్’ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇందులో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు. పవన్, పూరిల సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందన్నది ప్రస్తుతానికి సస్సెన్సే.
Must Read ;- బాలీవుడ్ లోకి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం