తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతునే ఉన్నాయి. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్‌ను ప్రతి రోజు ఉదయం తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేస్తుంది. శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,421 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో ఆరుగురు మృతిచెందారు. 1221 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,29,001కి చేరుకుంది. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,07,326 మంది ఉన్నారు. ఇంకా 20,377 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 1298. హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నవారు 17,214 మంది. జిహెచ్ఎంసి పరిధిలో గడిచిన 24 గంటల్లో 249 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 97, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 111, ఖమ్మంలో 89, భద్రాద్రి కొత్తగూడెంలో 86 కేసులు తాజాగా నమోదయ్యాయి.