‘అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తరువాత మూడున్నరేళ్లు చంద్రబాబు ఏం చేశారు’ అంటూ వైకాపా నాయకుడు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసలు రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తుంది మీరే కదా అంటూ కౌంటర్లు మొదలయ్యాయి.
అసలు చేసింది అంతా మీరే కదయ్యా..
‘అమరావతి రాజధానిగా అభివృద్ధి జరుగుతున్న తరుణంలో అధికార పగ్గాలు చేపట్టిన వైకాపా ప్రభుత్వం ఒక్కసారిగా మూడు రాజధానుల ప్రకటన చేసి అమరావతి నిర్మాణ పనులను ఆపించింది మీరే కదా..! మరిప్పుడు రాజధాని నిర్మాణానికి మీరేం చేశారు అంటారేంటి బొత్స’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్న సమయంలో మీరు ఎన్నిసార్లు నిర్మాణ పనులు చూడటానికి అమరావతికి రాలేదు. ఆ విషయాల గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించడం లేదు మీరు? రాజధానిలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని మీరు పదేపదే అంటున్నారు కదా. మరి అమరావతిలో నిర్మించిన హైకోర్టు, సచివాలయాలను తమరు చూడలేదా? అంటూ బొత్సకు కౌంటర్ వేస్తున్నారు అమరావతి ప్రజలు.
ఒక రాష్ట్రానికి ఎన్ని రాజధానుల ఉండాలన్న విషయం తెలుసా?
సచివాలయం నిర్మాణం జరిగే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా నిర్మాణ పనులను పర్యవేక్షించారు. మరి ఆ సంగతి ఇప్పుడు ఎలా మరిచిపోయారు అంటూ పలువురు తమ వాదనలు వినిపిస్తున్నారు. అసలు ఒక రాష్ట్రానికి ఎన్ని రాజధానులు ఉండాలో కూడా తెలియని వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు ప్రత్యక్షంగానే విమర్శిస్తూంటే అవన్నీ మీకు వినిపించడం లేదా అంటూ అమరావతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మరి పరిపాలన ఎక్కడ నుంచి చేస్తున్నారు
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఒక్కో వ్యవస్థ ఒక్కో రాజధానిలో ఉంటే ప్రజలు వారి పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడతారు అన్న విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం హాస్యాస్పందమన్నారు. రాజధాని నిర్మాణ పనులను గ్రాఫిక్స్ లో చూపించారు అని మొత్తుకుంటున్నారు కదా.. మరి పాలన చేస్తున్నది ఎక్కడ నుంచి అమరావతి నుంచి కాదా అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.











