ఆమె ఓ గవర్నర్.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఎప్పుడూ బిజీబిజీగా ఉంటారు. ఉన్నతమైన హోదాలో ఉన్నా నిరాడంబరమైన జీవితానికే ప్రాధాన్యం ఇస్తారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే, పెద్ద మనసుతో సాయం చేస్తారు. ఆమె తెలంగాణ గవర్నర్ తమిళిసై. తాజాగా చెన్నైలో ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే మార్గం మధ్యలో ఆమెకు ఓ యువకుడు గాయాలతో కనిపించడం గమనించారు. వెంటనే డ్రైవర్ ను అలర్ట్ చేసి కాన్వాయ్‌ను ఆపి, అతడి పరిస్థితి తెలుసుకున్నారు. దెబ్బలు తగిలి రక్తం కారుతుండటంతో కాన్వాయ్‌లోనే ఆస్పత్రికి తరలించి ప్రాణాలు నిలిపారు. అక్కడితో ఆగిపోకుండా, డాక్టర్లకు ఫోన్ చేసి యువకుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో తమిళిసై సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన గవర్నర్ తమిళిసైని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్…!!
ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా సరితూగని వైసీపీ... తాను అధికారంలో...