ప్రజలకు మంచి చెడులను చెప్పాల్సిన పెద్ద మనిషి.. మంత్రి హోదాలో ఉంటూ రాసలీలలను నడిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం మంత్రి రాసలీల కథనాలు పలు ఛానెల్‌లో ప్రసారం కావడంతో రాజకీయ ప్రకంపనలకు దారితీసేలా ఉంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఆ యువతితో రాసలీల వలపు బాణాలను సోషల్ మీడియా వేదికగా సంధించినట్లుగా ఆ రాసలీల భాగోతం మొత్తం వైరల్ అయ్యింది.
యువ నటిపై మనసు పారేసుకున్న మంత్రి…
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ శివారులో సంచలనం సృష్టించిన హత్యాచార ఘటన, ఎన్‌కౌంటర్ ఘటనలపై రాంగోపాల్ వర్మ నిర్మించిన సినిమాలో లీడ్ రోల్‌లో నటించిన ఓ యువతిపై ఓ రాష్ట్ర మంత్రి మనసు పారేసుకున్నట్లు తెలిసింది. మంత్రికి అత్యంత సన్నిహితురాలైన మరో యువతితో కరీంనగర్‌లో జరిగే లేజర్ షో కార్యక్రమానికి ఆ సినీ నటిని పిలిపించి కార్యక్రమం అనంతరం తన హోటల్ గదిలోకి వచ్చేలా మంత్రి ఒప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే దానికి సదరు యువ నటి ఒప్పుకోకపోవడంతో మంత్రికి సన్నిహితంగా ఉండే యువతికి నటికి మధ్య గొడవ జరగినట్లు తెలిసింది. ఆ యువతి హైదరాబాద్ వచ్చేసి వాట్సాప్ సందేశాలతో సహా మంత్రి రాసలీలల వ్యవహారాన్ని సోషల్ మీడియాలో విడుదల చేయడంతో రాజకీయ ప్రకంపనలు అలుముకున్నాయి.
యువతిని హోటల్ కు రమ్మన్న మంత్రి!
కార్యక్రమం అనంతరం హోటల్‌కి వెళ్లిన ఆ యువతికి ప్రలోభ పెట్టే ప్రయత్నం మంత్రి చేశారా అన్నది ఇంటెలిజెన్స్ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి సన్నిహితురాలు నటితో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నటి వ్యక్తిగత ఫోటోలను మంత్రి సన్నిహితురాలు తీసి వాటిని మంత్రికి పంపే ప్రయత్నం చేయడం గుర్తించిన సదరు యువతి మొబైల్‌ను లాక్కుంది. ఆ మొబైల్‌తో సహా హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మొత్తం వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. దీంతో ఆ మంత్రి వ్యవహారం పార్టీ పెద్దల దృష్టీకి వెళ్లినట్లు తెలిసింది. దీనిపై మంత్రి సంజాయిషీ చెప్పుకునే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
అయితే మంత్రి జరిపిన రాసలీల వ్యవహారంపై ప్రజలు, పలు మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ ఇలాంటి పనులు చేయడం సరికాదని ఆరోపిస్తున్నారు.











