తొలి పాన్ ఇండియా స్టార్ ఎవరంటే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరే ముందు వరుసలో ఉంటుంది. ‘రోబో’తో ఆ క్రేజ్ పరాకాష్టకు చేరుకుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొన్న అక్టోబరు 1కి పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సినిమా ఓ విజువల్ వండర్ అనే చెప్పాలి. ఈ సన్నివేశం ఎలా తీశారబ్బా అని మనకే అనిపిస్తుంది. ఒక విధంగా పాన్ ఇండియన్ సినిమాలు మనమూ తీయవచ్చన్న ధైర్యాన్ని దర్శకనిర్మాతలకు రోబోనే ఇచ్చింది. రజనీ నట, ఐశ్వర్యారాయ్ అందం, శంకర్ టేకింగ్ ఒక ఎత్తయితే ఇందులో వాడిన గ్రాఫిక్స్ ఇంకో ఎత్తు. రజనీ రోబోగా నటించిన చిట్టి పాత్ర అయితే మరో సీక్వెల్ తీయడానికి ప్రేరేపించింది.
ఈ సినిమాని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ‘రోబో’ విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసింది. అసలు ఈ రోబోను ఎలా తయారుచేశారు? రైలులో జరిగే ఫైట్ ఎలా తీశారు? మంటల్లో చిక్కుకున్న అమ్మాయిని రోబో చిట్టి కాపాడటం లాంటి అంశాలతో ఈ వీడియో రూపొందించారు. ఈ చిత్రీకరణ ఎలా జరిగిందో చూసేవారికి ఆసక్తికరంగా ఉంటుంది. అప్పట్లో ఈ సన్నివేశాలు ఎలా తీశారా? అని అందరూ అనుకునేవారు. వాటికి సమాధానంగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ వీడియో చేసింది.
సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదేదో బాగుందనుకుని మిగతా సినిమాలు కూడా ఇదే తరహాలో వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమా ఎలా తీశారనే అంశాన్ని రహస్యంగా ఉంచేవారు. ఇప్పుడు మాత్రం అన్నిటినీ జనానికి చూపించేస్తున్నారు. హాలీవుడ్ లో కూడా ఇలాంటి సంస్కృతే ఉంది. ఈ వీడియో లింక్ ఇస్తున్నాం చూడండి.
https://twitter.com/sunpictures/status/1311651911263645701











