ఒక్కో దేశం కొవాగ్జిన్ వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపిస్తోంది. ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు పెద్దగా లేకపోవడం, కొత్త స్ట్రెయిన్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తుండడంతో.. అన్ని దేశాలనూ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో.. భారత్ బయోటెక్, బ్రెజిల్ మధ్య ఓ భారీ ఒప్పందం కుదిరింది. ఏకంగా 2 కోట్ల డోసుల కొవాగ్జిన్ టీకా కోసం బ్రెజిల్.. అగ్రిమెంట్ చేసుకుంది. ఈ అగ్రిమెంటు ప్రకారం భారత్ బయోటెక్ సంస్థ.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో టీకాల సరఫరాను ప్రారంభిస్తుంది.
భారత్ బయోటెక్ సంస్థ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. కాగా.. ఈ వారం మొదట్లో ఉక్రెయిన్ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కూడా హైదరాబద్‌లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్ పట్ల ఆసక్తి కనబరిచారు. ఇప్పటివరకూ భారత్ వివిధ దేశాలకు 36.197 కోట్ల టీకా డోసులను ఎగుమతి చేసింది. వీటిలో 67.5 లక్షల డోసులను గ్రాంట్ కింద, మిగిలిన వాటిని వ్యాపార ఒప్పందాల కింద సరఫరా చేసింది. భారత్ రాబయే నెలల్లోనూ టీకాలను ఎగుమతి చేస్తుందని, అయితే.. దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు.
Must Read ;- స్వదేశీ కొవాగ్జిన్ చూసి వాళ్లు ఏడుస్తున్నారా..?