నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మే 28న రిలీజ్ డేట్ ఫిక్సయింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక దీని తర్వాత ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాకి కమిట్ అయ్యారు. అలాగే.. ఈ ప్రాజెక్ట్ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బాలయ్య తో ఒక సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, ప్రేమమ్, అరవింద సమేత వీరరాఘవ, జెర్సీ, అలవైకుంఠపురములో , భీష్మ’ లాంటి సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించింది ఈ సంస్థే.
నిర్మాత చినradhakrishna బాబు.. త్వరలో బాలయ్యతో ఓ ప్రతిష్థాత్మ సినిమా నిర్మించాలని నిర్ణయించకున్నారు. దీని కోసం ఓ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ను అనుకుంటున్నారు. వారిలో ఒకరిని డైరెక్టర్ గా ఫైనల్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. మరికొద్ది రోజలు ఆగాల్సిందే.