మన హీరో శర్వానంద్ తాతయ్య ఇల్లు కృష్ణానది వరద నీటిలో కొట్టుకుపోయింది. శర్వా తాతయ్య భారత అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరు డాక్టర్ మైనేని హరిప్రసాద్. ఆయన ఇల్లు కృష్ణానది వరద నీటిలో కొట్టుకుపోయింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో అవనిగడ్డ సమీపంలోని ఎడ్లలంక గ్రామంలో నది ఒడ్డున శర్వా తాతయ్య ఇల్లు ఉంది. హీరో శర్వానంద్ బంధువులంతా విజయవాడ, కృష్ణాజిల్లాలోనే ఉంటారు. శర్వానంద్ షూటింగులకు విరామమిచ్చి తరచూ ఈ ప్రాంతానికి వస్తుంటారు.
ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా శర్వానంద్ తాతయ్య ఇంట్లోనే మకాం ఉండేవాడు ఈ భవనం కృష్ణా నది కి పక్కనే ఉంటుంది. ఎప్పుడూ రాని రీతిలో వరద నీరు వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక్కసారిగా నీటిని వదలడంతో ఆ ధాటికి ఈ ఇల్లు కొట్టుకుపోయింది. స్థానికులంతా పెద్దఎత్తున గుమికూడినా వారు ఏమీ చేయలేకపోయారు. గత సంవత్సరం వచ్చిన వరదల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. శర్వానంద్ ముత్తాత, హరిప్రసాద్ తండ్రి నివసించిన ఇల్లు అప్పుడు నదిలో కొట్టుకుపోగా, ఈసారి తాతయ్య ఇల్లు కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతి అధికంగా ఉండటమే దీనికి కారణం. పాతకాలపు పెంకుటిల్లు పునాదులు కదిలిపోయి నదిలో కలిసిపోయింది.











