మీడియా గొంతు నొక్కడంలో ఆరితేరారు!
‘‘స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో మీడియా హక్కులను కాలరాసి, స్వేచ్ఛను అణగదొక్కి, గొంతుకు చారలుపడేట్లు నొక్కిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే జగన్ రెడ్డి ప్రభుత్వమని బల్లగుద్ది చెప్తారు జర్నలిస్టులు!’’ జర్నలిస్టులపై ఏపీ కొనసాగుతున్న ఆంక్షాలు, ఒత్తుళ్లు అన్నీఇన్నీ కావు. అందిచాల్సిన సంక్షేమం, నివేశ స్థలాలు, ఇళ్లు, కరోనా మృతులకు చెల్లించాల్సిన ఎక్సగ్రేషియా, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, పిల్లల ఫీజు రియంబర్స్ మెంట్స్ వంటివి ఏ ఒక్కటి జగన్ రెడ్డి ఈ రెండునరేళ్లలో అందించిన పాపాన పోలేదు! చివరికి మీడియాను పురుగుల కన్నా దారుణంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల చూస్తుంటే.. ‘‘వాటిని ఖండించాల్సిన కొన్ని జర్నలిస్ట్ సంఘాలు, మీడియా సర్కిల్స్ పెద్దలం అని స్వయం ప్రకటిత వ్యక్తులు అధికారపార్టీ నేతల మూతులు నాకుతున్నారు!’’ జగన్ రెడ్డి గెలుపు మీడియా పాత్ర కూడా ఉందన్న సంగతి ఆయన మరిచాడు. వందకు 95 శాతం మీడియా .. జగన్ ఓదార్పును, పాదయాత్రను, ఎన్నికల ప్రచారాన్ని ఒక ఫాజిటివ్ మోటివ్ లో ప్రజల ముందు అవిష్కరించింది! అలా అప్పుడు చేసినదానికి నేడు దానిని పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు జర్నలిస్టులు!! ఏపీలో ప్రస్తుతం ఉద్యోగులు మొత్తుకుంటున్నట్లు.. జర్నలిస్టులు కూడా జగన్ రెడ్డి బాధితులుగా మారారు! ‘‘ఉద్యోగుల రెండు చేతుల్తో ఓట్లేపిస్తే.. జర్నలిస్టులు ప్రజలందరూ ఓట్లేసేలా కథనాలు, స్పాట్ వార్తలు రాశారు’’ ఇలా జగన్ రెడ్డిని నెత్తికెక్కించుకున్న మీడియా జీవితం ఇటువంటి తప్పు చేయకూడదని.. నేడు లెంపలేసుకుంటున్నారు.
మీరు నిషేదించిది మూడు మీడియాలనే.. కానీ మీడియా మొత్తం మిమిల్ని నిషేదించింది..!
సమాచార, పౌర సంబంధాల శాఖామంత్రిగా ఉన్న పేర్ని నాని మీడియా సమావేశంలో జర్నలిస్టు కొత్త అక్రిడేషన్ ఎప్పుడిస్తారు సార్ .. అని అప్పట్లో అడిగిన జర్నలిస్టులకు మతిపోయే డైలాగ్ ఒకటి కొట్టారు. ఆ డైలాగ్ ను మీడియా మిత్రులు జీవితంలో మర్చిపోరు. అక్రిడేషన్లు ఇస్తే.. మీ సచివాలంలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లో చేసే పైరవీరు మాకు తెలుసు.. ఎవరికి అక్రిడేషన్ ఇవ్వాలో వడగట్టి వారికి మాత్రమే ఇస్తామని చెప్పడం ఆయన అవివేకానికి అద్దం పట్టింది! 1956 నాటి నుంచి జర్నలిస్టులు ఈ స్థాయిలో అక్రిడేషన్ కార్డు కోసం, హక్కుల కోసం, భావప్రకటన స్వేచ్ఛ కోసం ఇంతగా ఇబ్బంది పడిన దాఖలాలే లేవు! ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు లేనెలేవు! గడిచిన ఆరు దశాబ్ధాల పైబడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం నుంచి ఎదుర్కొనన్ని గడ్డు, సంక్లిష్ట పరిస్థితులను మీడియా ఏపీలో ఎదుర్కొంటుంది! జగన్ పార్టీకి, ప్రభుత్వానికి కరపత్రం, అద్దె మైకులాంటి సాక్షి, కార్పోరేట్ చానెల్స్ గా పేరుమోసిన ఆ ఒక్క చానెల్ మినహాయిస్తే ఏ ఒక్క మీడియా జగన్ కు ఫేవర్ గా రాయడంలేదన్నది అక్షర సత్యం! ‘‘నిజం చెప్పాలంటే ఫ్రింట్ మీడియాలో జగన్ రెడ్డి ఫోటో ముద్రించడానికి, ఎలక్ట్రానిక్ మీడియాలో జగన్ రెడ్డి విజువల్స్ వేయడానికి కూడా ఇష్టపడటం లేదన్నది వాస్తవం!’’ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో మీడియా ముందుకు వచ్చి ఒక్క మీడియా సమావేశం పెట్టి, మాట్లాడలేకపోయాడు జగన్ రెడ్డి! అసలు ఏపీలో సీఎంగా జగన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న విషయాన్ని మీడియా ఎప్పుడో మరిచింది. తాడేపల్లి ప్యాలెస్ లో అధికారులతో సమీక్షా కార్యక్రమాల్లో ఐ అండ్ పీఆర్ కెమెరా ముందు అలా విజువల్స్ లో మాత్రమే ప్రత్యక్షమవుతారు. సౌండ్ బైట్ ఏ ఒక్కటైన రివ్యూకు సంబంధించి ఇస్తారంటే మచ్చుకైన కనిపించదు! ‘‘దేశ వ్యాప్తంగా మీడియాపై ఈ స్థాయి వివక్షచూపే ముఖ్యమంత్రి చూడలేదు.. చూడబోం కూడా అని ప్రత్యక్షంగానే జర్నలిస్టులు విమర్శిస్తున్నారు’’ అందుకే మీడియా జగన్ రెడ్డిని, ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని ఎప్పుడో నిషేదించింది! గన్ నుంచి వచ్చే ఒక్క తూట మనిషిని చంపుతోంది.. అదే జర్నలిస్టు కలం నుంచి జాలువారే ఒక్క అక్షరం కోట్లాది మందికి దారిచూపుతోంది.. అన్న సిద్దాంతానికి కట్టుబడ్డ పనిచేస్తున్న మీడియాను బుధవారం మంత్రి కొడాలి నిషేదించారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ( పత్రిక ), ఈనాడు ( పత్రిక ), ఈటీవీ, టీవీ 5 లను వైసీపీ పూర్తిగా నిషేదిస్తున్నామని మంత్రి చెప్పడం పట్ల ఒకింత ఆశ్చర్యం, వింతగా కూడా అనిపించింది. ఎందుకంటే మేజారిటీ మీడియాతో పాటు మోస్ట్ సీనియర్ జర్నలిస్టులు జగన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి డప్పుకొట్టడాన్ని తిరస్కరించి, కేవలం పతనానికి మాత్రం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారన్న సంగతి మంత్రి కొడాలికి తెలియలేదు కాబోలు..!











