సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ సర్కారు వారి పాట. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా ఈపాటికే కంప్లీట్ కావాల్సింది. అయితే.. మహేష్ మోకాలికి సర్జరీ జరగడంతో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్ఆర్ఆర్ వలన సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కూడా వాయిదా పడింది.
అయితే.. త్వరలోనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఏప్రిల్ 1న ఈ సినిమాని భారీ స్ధాయిలో విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. దర్శకుడు పరశురామ్ తో దిగిన ఫోటోను తమన్ షేర్ చేసి ఈ చిత్రానికి సంబంధించిన పాటలు త్వరలో మీరు విననున్నారు అంటూ తనదైన శైలి లో చెప్పుకొచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ కోసం డైరక్టర్ పరశురామ్ చాలా బాగా వర్క్ చేస్తున్నారని, అలాగే సినిమా కోసం టీమ్ అంతా కూడా కష్ట పడుతోంది అని అన్నారు. థమన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. సంక్రాంతికి సర్కారు వారి పాట చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి సర్కారు వారి సినిమా రాకపోయినా.. సర్కారు వారి పాటలు వస్తున్నాయి అన్న మాట.











