తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..!
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ రహితంగా భర్తపై దాడి చేసింది భార్య! అక్కడితో ఆగకుండా భర్తను అతికిరాతకంగా కత్తితో మర్మాంగాన్ని కోసి హత్య చేసింది. రాజమహేంద్రవరం అర్బన్ నార్త్ జోన్ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. జిల్లాలోని సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మర్రే అబ్బులు (46), ముత్యాలు భార్యభర్తలు. వీరి ఇరువురికి మద్యం సేవించే ఆలవాటు ఉంది. ఇద్దరూ బుధవారం రాత్రి కూడా తాగి గొడవడి ఒయటకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున ముత్యాలు మాత్రమే ఇంటికి వచ్చింది. ఆ తరువాత రాపాక గ్రామ శివారు కల్వర్టు వద్ద ఓ మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. తన భర్త ఫిట్స్ వల్లే చనిపోయాడని మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేసింది ముత్యాలు. తమదైన శైలిలో కూలిలాగితే సభ్య సమాజం తలదించేకునేలా నిజం బయటకు పొక్కింది. మృతదేహంపై ఉన్న గాయాలు గమనించిన పోలీసులు.. డెడ్ బాడీని పరిశీలించగా.. పురుషాంగం కోసేసి ఉండటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మృతుడి భార్య ముత్యాలే ఈ ఘాతుకానికి ఒడికట్టినట్లు నేరాన్ని అంగీకరించింది!











