ట్రెజరీ ఉద్యోగుల మెడపై కత్తి!
ఉద్యోగుల మెడకు భూటకపు పీఆర్సీ పేరుతో బిగిస్తున్న ఉచ్చును వ్యూహాత్మకంగానే తొలగిస్తున్నారు ట్రెజరీ ఉద్యోగులు. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి మరింత సమయం కావాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు ఖజనా ఉద్యోగులు! మెడపై కత్తిపెట్టి ఒత్తిడి చేయాలని చూస్తే.. మావళ్ల కాదంటూ చేతులెత్తేశారు. బిల్లుల ప్రాసెస్ కు రెండుమూడు రోజులంటే కుదరదని, కనీసం వారం సమయం కావాల్సిందేనని చెప్పారు. ఈ మేరుకు ట్రెజరీ డైరెక్టర్ కార్యాలయానికి ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ లేఖ రాసింది. ఉద్యోగుల వేతనాల బిల్లులు ప్రాసెస్ చేయడానికి ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ కావాలని ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షడు శోభన్ బాబు లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1 అనుసరిస్తున్నాం!
11వ పీఆర్సీ ప్రకారం కొత్త వేతనాల బిల్లులు ప్రాసెస్ చేయడానికి ఉద్యోగులు సర్వీస్ రిజిస్టర్ ను ఫాలో కాకుంటే అనే పరిణామాలను భవిష్యుత్తులో ఎదుర్కొవాల్సి వస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు శోభన్ పేర్కొన్నారు. సర్వీస్ రిజిస్టర్ వెరిఫికేషన్ తర్వాతే ఫిక్సేషన్ ఎలా జరిగిందో తెలుస్తోందని, లేకపోతే బిల్లులు చేయలేమని చెప్పారు. ట్రెజరీ ఉద్యోగులపై కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలను ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తే ఎలా? పొరపాట్లు జరిగితే భాధ్యత ఎవరు తీసుకోవాలి? అంటూ ప్రశ్నిస్తూ.. ట్రెజరీ ఉద్యోగుల తప్పిదాలకు బాధ్యులను చేసేలే గతంలో ప్రభుత్వమే జీవో నెంబర్ 1 ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అందుకే సమయం కావాలని, అలా ఇవ్వకుంటే ఏదైన పొరపాట్లు జరిగి.. ప్రజాధనం నష్టపోయే ప్రమాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేసే రాష్ట్ర ట్రెజరీ వ్యవస్థ సర్వర్లలో సమస్యలు తలెత్తాయని చెప్పారు. అయినప్పటికీ కొత్త పీఆర్సీ అమలుకు సర్కారు ప్రయత్నించడం సరైన విధానం కాదని లేఖలో ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ చెప్పుకొచ్చారు.