యుద్ధం ఒకటే .. ఆయుధాలే వేరు!
రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు, మరో 80 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు, బంధువులు జగన్ రెడ్డి ప్రభుత్వంతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నారు. మొత్తంగా కోటి మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్ అనాలోచిత నిర్ణాయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారం రోజులు నుంచి వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలో శుక్రవారం ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దిక్కుమాలిన స్టేట్మెంట్స్ కు ఒక రేంజ్ లో స్పందిస్తూ.. సమాధానం చెప్పారు. ‘‘ బెదిరిస్తే మెరుపు సమ్మె తప్పదు.. ప్రజా రవాణాను స్తంభించేలా చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. తాజా పరిణామాలు, ప్రభుత్వ విచిత్ర పోకడలను చూసి మురోవైపు స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా గట్టి హెచ్చకరికలు జారీ చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంతో ప్రస్తుతం యుద్ధం చేస్తున్నామని.. అన్ని రకాల అస్త్రశస్త్రాలను వాడేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.
మొండిగా ముందుకెళ్తే.. సమ్మె సైరన్ మోగుతోంది!
జగన్ రెడ్డి ఎన్నికల హామీని నెరవేర్చామని ఉద్యోగులు గుర్తు చేస్తుంటే.. ఆయన మండుతోంది. తొండాట ఆడుతూ ఉద్యోగులను నిలువున దగా చేయాలని చూస్తున్నారన్నది క్లియర్ గా అర్థమౌతోంది. దివంగత ముఖ్యమంత్రి తనయుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డికి ప్రజలు, ఉద్యోగులు ఎంతో సహనంతో ఒపిగ్గా ఇన్ని రోజులు చూస్తూ వచ్చారు. కానీ అదే ప్రజలు నీ పాలన లోపాలు, దార్శినికత వైఫల్యాలున్నాయి సరిచేసుకొండి సార్ అంటుంటే.. వెటకారంగా చూడాటమేకాక.. రాజద్రోహమంటూ కేసులు కట్టి కటకటాల పాలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం జగన్ రెడ్డి పాలనలో నిత్యం చూస్తుందే! అంతిమంగా ఓటేసి గెలిపించిన పాపానికి ఇదే చివరి తప్పిదమని లెంపలేసుకుని అవకాశం కోసం ప్రజలు చూస్తుంటే.. ఇంకోవైపు ఉద్యోగులు ఉద్యమాల బాట పట్టారు. ‘‘కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం మెమో జారీ చేసి.. ట్రెజరీ ఉద్యోగులపై ఆదేశాల ఒత్తిడి తీసుకొస్తుంటే.. ఆ జీతాలే వేయ్యండి మెరుపు సమ్మెకు దిగకపోతే ఒట్టు అంటూ అల్టిమేటం జారీ చేస్తున్న ఉద్యోగులు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం మార్చుకుని.. కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు! అలా కాకుంటే ఏ సమయంలోనైనా ఉద్యోగులు సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరిస్తున్నారు.











