కరోనా వ్యాక్సిన్.. ప్రపంచ దేశాలు మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నది దీని కోసమే. వ్యాక్సిన్ తయారుచేసినంత మాత్రానా సరిపోదు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ఎమర్జెన్సీ అవసరాలకు ట్రైల్ రన్స్ ఆధారంగా అమోదం తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. అవి ఏమాత్రం వికటించినా.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పాతారనడంలో సందేహం లేదు. అయినా సరే.. మేము ముందు ఉంటాం అంటూ కొందరు మహిళలు మొదటి టీకా అందుకున్న మొదటి మహిళలుగా చరిత్రలో తమ పేరును చిరస్థాయి చేసుకున్నారు. మరి వారి గురించి తెలుసుకుందాం రండి..
మార్గరెట్ కీనన్, యుకే
Margaret Keenan, the first patient in Britain to receive the coronavirus vaccine, hopes to set an example for people hesitant to become vaccinated. pic.twitter.com/kMGEp7F4Vy
— The New York Times (@nytimes) December 8, 2020
యుకే మొదటగా ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరి దాన్ని మొదటగా తీసుకున్న వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంకో వారంలో 90 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్న బామ్మ గారు ఈ మహత్కార్యానికి ముందుకొచ్చారు. యుకేలో ఆమోదం పొందిన తర్వాత దేశంలో టీకా మొదటగా తీసుకున్న వ్యక్తిలో తన పేరును దేశ చరిత్రలో నిలుపుకున్నారు మార్గరెట్ కీనన్. పుట్టినరోజుకంటే ముందే బర్తడే గిఫ్ట్‌ను దేశం తరపున అందుకున్నానని ఈ బామ్మగారు వ్యాఖ్యానించడం గమనార్హం.
సాండ్రా లిన్డ్‌సే
Our nation took a collective sigh of relief in mid-December when @LehmanCollege alumna Sandra Lindsay became the face of hope as the first person to receive the COVID-19 vaccine in the United States.
Read more: https://t.co/yLMP1iXOOh pic.twitter.com/5oZIp2ZYz9
— The City University of New York (@CUNY) December 27, 2020
అగ్రరాజ్యంలోనూ మొదటి టీకాను వేయించుకున్నది ఒక మహిళ కావడం గమనార్హం. లాంగ్ ఐల్యాండ్ జెవిష్ మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్ నర్సుగా పనిచేస్తున్న సాండ్రా మొదటి ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చారు. వ్యాక్సిన్ సురక్షితం అని ప్రజలలో నమ్మకాన్ని కలిగించడానికి తను ఈ పనికి పూనుకున్నట్లుగా తెలియజేశారు సాండ్రా. అమెరికా చరిత్రలో సాండ్రా పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు.
బామ్మగారి మొదటి అడుగు..
A 90-year-old woman living in a retirement home in Lucerne, Switzerland, was the first person in the country to receive the Covid-19 vaccine on Wednesday. https://t.co/ykVTyrQi1X
— The New York Times (@nytimes) December 23, 2020
స్విర్జర్లాండ్‌లో మొదటి వ్యాక్సిన్ అందుకున్నది 90 ఏళ్ల మహిళ కావడం ఆశ్చర్యపడాల్సిన విషయం. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో దేశ ప్రజల కోసం ప్రమాదమని తెలిసిన ముందడుగు వేశారీ బామ్మ గారు. దేశానికి ఇది నావంతు సేవ అని చెప్పడంలోనే ఈ బామ్మ గారి అంకిత భావం తెలుస్తుంది. ఆ తర్వాత స్వర్జర్లాంట్ అంతగా మొదటి విడతగా దాదాపు 10 లక్షల డోసులు అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
101 ఏళ్లలో ప్రజల కోసం ముందడుగు..
#Germany #Halberstadt #SachsenAnhalt #Coronavirus #VACCINE
The resident Edith Kwoizalla from Halberstadt in Saxony-Anhalt is 101 years old and is the first to be vaccinated against Corona on Saturday before the official vaccination start in Germany. She received the first doses pic.twitter.com/eZJg3irjeL
— Xy5Z89🇩🇪🇪🇺 (@Xy5Z89) December 26, 2020
ఆమె వయసు 101 సంవత్సరాలు. ఆ వయసులో ఆమె ఏం చేయగలదు అనుకుంటారు అందరూ. కానీ, దేశ ప్రజలందరి కోసం ముందు నేనుంటా అంటూ.. ఆ వయసులో తొలి వ్యాక్సిన్‌ను అందుకుని, ప్రజలకు వ్యాక్సిన్ ఆవస్యకత గురించి తెలియజేసింది. డిసెంబర్ 26న ఈ బామ్మగారు జర్మని దేశంలో తొలి అధికారక వ్యాక్సిన్‌ని అందుకుని దేశ చరిత్రలో తన పేరును ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
బ్రిట్ జాన్సన్, స్వీడెన్
Bugün İsveç’te ilk Covid-19 aşısı, Gun-Britt Johnsson adında Mjölby’de bir huzurevinde yaşayan 91 yaşındaki kadına yapıldı. pic.twitter.com/ZXecGvglHK
— Inci Aksoylu (@AksoyluInci) December 27, 2020
స్వీడెన్ దేశంలో 91ఏళ్ల వయసుగల బ్రిట్ జాన్సన్ మొదటి వ్యాక్సిన్ డోసును అందుకున్నాను. కరోనా వ్యాక్సిన్ మొదటగా అందుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని, వ్యాక్సిన్‌పైన తనకెలాంటి అనుమానాలు లేవని వెల్లడించారు బ్రిట్. 2021 జూన్-జులై నాటికి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావాలని స్వీడెన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
కరోనా వ్యాక్సిన్ విషయంలో నేటికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అటువంటి సందేహాన్ని పటాపంచలు చేస్తూ వ్యాక్సిన్ అందుకుని దేశ ప్రజలకు దిశా నిర్ధేశంగా నిలిచారీ మహిళలు. వ్యాక్సిన్ అందుకున్న మొదటి వ్యక్తులుగా ఆ దేశ చరిత్రలో తమకంటూ ఒక పేజీ లిఖించుకున్నారీ మహిళామణులు.