సహవాస దోషం ఎక్కడికి పోతుంది?.. అంటూ మ పెద్దలు ఊరికే చెప్పలేదు. తాను సీఎంా ఉండగా… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నిర్నయాలనే వ్యతిరేకిస్తున్నారంటూ సొంత పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా.. నాడు నరసాపురం ఎంపీగా ఉన్న ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీకి హుకుం జారీ చేశారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా జగన్ మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా అడుగులువ వేసిన నాటి సీఐడీ అదికారులు రఘురామను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించి…జగన్ చెప్పినట్లుగానే ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అంతేనా… రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న దృశ్యాలను ఓ సీఐడీ అధికారి ద్వారా లైవ్ లో వీక్షించిన జగన్ మహదానంద పడిపోయారని గుసగుసలు వినిపించాయి. జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి విడదల రజిని కూడా జగన్ మాదిరే ఆ పైశాచిక ఆనందాన్ని పొంది తానేమీ జగన్ కు తీసిపోనని విర్రవీగిపోయారట.
విడదల రజిని పాల్పడ్డ ఈ రాక్షస చర్యపై ఇప్పుడు పల్నాడు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. వైసీపీ జమానాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే… టీడీపీ ఐటీ విభాగం ఐటీడీపీకి చెందిన పిల్లి కోటి తదితరులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వారిపై ఆగ్రహం పెంచుకున్న రజిని.. టీడీపీని వీడాలని వారిపై బెదిరింపులకు పాల్పడ్డారట.అయితే రజిని బెదిరింపులకు కోటి గానీ… అతడి మిత్ర బృందం గానీ లొంగలేదట. దీంతో వారిపై కక్ష పెంచుకున్న రజిని.. నాడు చిలకలూరిపేట అర్బన్ సీఐగా పనిచేసిన సూర్యనారాయణకు చెప్పి… కోటి, అతడి మిత్రులను అరెస్ట్ చేయించారట. పోలీస్ స్టేషన్ లో కోటి మిత్ర బృందంపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ ఉంటే… ఆ దృశ్యాలను రజిని లైవ్ లో చూసి జగన్ మాదిరే సంబరపడిపోయారట. తనకు ఎదురుగా వస్తే… ఇక ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఆమె కోటి బృందానికి వార్నింగ్ ఇచ్చారట. ఇప్పుడు ఏపీలో వైసీపీ అదికారం నుంచి దిగిపోగా… టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టింది కదా. అంతేకాకుండా వైసీపీ అరాచకాలపై వరుసగా కేసులు నమోదవుతున్న తీరుతో కోటి తాజాగా నేరుగా పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి నాడు తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు.
అసలే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెడుతున్న అసభ్య సందేశాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో వెర్రి తలలు వేసిన వారిలో చాలా మంది ఇప్పటికే అరెస్ట్ కాగా… సూత్రధారులను పట్టుకునేపనిలో పోలీసులు నమిగ్నమయ్యారు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడి ఇంటిపై దాడికి యత్నంకేసులను రీఓపెన్ చేసిన పోలీసులు… వాటిలో పాత్ర ఉన్న వారిపై చర్యల కోసం పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ మహిళగా ఉంటూ.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన యువకులపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగింపజేయడంతో పాటుగా సదరు దృశ్యాలను లైవ్ లో వీక్షించి రాక్షాసానందం పొందిన రజినిపై పోలీసులు కఠినంగానే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన త్వరలోనే రజినికి పోలీసుల నుంచి శ్రీముఖం అందడం ఖాయమేనన్న మాట.