నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న తెలుగు దేశం పార్టీపై ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏ మేర విరుచుకుపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఇప్పటికే చాలా పార్టీలకు చెందిన నేతలు టీడీపీపై చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజమని తేలలేదు. అంతెందుకు?.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు చేస్తూ లెక్కలేనన్ని కేసులు వేశారు. వీటిలో ఏ ఒక్క కేసులోనూ చంద్రబాబు దోషిగా నిరూపితం కాలేదు. అసలు చంద్రబాబును కోర్టుకు కూడా రప్పించలేకపోతున్న వైనం జనానికి తెలిసిందే. తన, తన కుటుంబ సభ్యులు, తన కుటుంబం ఆధ్వర్యంలోని ఆస్తుల వివరాలను ఏటా వెల్లడిస్తున్న కుటుంబంగా చంద్రబాబు ఫ్యామిలీకి దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీపై వినిపిస్తున్న ఓ కొత్త ఆరోపణ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే.. టీడీపీ శ్రేణులు దానిని తిప్పి కొట్టడంతో పాటుగా.. ఆ ఆరోపణను కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు చేసినదిగా తేల్చేశాయి.
ఆ ఆరోపణ ఏమిటంటే..?
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ప్రస్థానం ప్రారంభించింది. 1982లో పురుడు పోసుకున్న టీడీపీ.. 9 నెలలు తిరక్కుండానే అధికార పార్టీగా రికార్డు విజయం సాధించింది. ఆ తర్వాత కూడా అన్ని పార్టీ అప్రతిహాతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా ప్రజా పక్షమే తన వైఖరిగా సాగుతోంది. ఈ క్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయంగా జూబ్లీ హిల్స్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరిట ఏళ్ల క్రితమే ఓ భవనం ఏర్పాటైంది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత ఏపీ వ్యవహారాల కోసం గుంటూరు జిల్లా పరిధిలో అమరావతికి కూతవేటు దూరంలో కొత్తగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. వెరసి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ కార్యక్రమాలు తగ్గిన మాట వాస్తవమే. కేవలం తెలంగాణ వ్యవహారాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ మార్పు అత్యంత సహజమనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోని కొంత భాగాన్ని ఓ ప్రైవేటు సంస్థకు అద్దెకు ఇస్తున్నారని, అందులో ఓ కోచింగ్ సెంటర్ ఏర్పాటు కానుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ కోచింగ్ సెంటర్ ను నడుపుతున్న సంస్థగా ఎక్సెల్ సివిల్స్ అకాడెమీ అంటూ కూడా సంస్థ పేరును కూడా ప్రస్తావించారు.
అసలు నిజమేంటంటే..?
టీడీపీ ప్రత్యర్థులు సంధించిన ఈ ఆరోపణలో వీసమెత్తు నిజం కూడా లేదనే చెప్పాలి. ఎక్సెల్ సివిల్స్ అకాడెమీ అనేది టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు నడుపున్న సంస్థ. పార్టీలోని పేద, దయనీయ స్థితిలో ఉన్న కార్యకర్తల పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు 2011లో ఏర్పాటైంది. నాడు పార్టీ కార్యకర్తల సంక్షేమ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు రంగంలోకి దిగిన ప్రస్తుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన సంస్థ ఇది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలు ఏదేని ప్రమాదంలో గాయపడ్దా, మృతి చెందినా వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన లోకేశ్.. సదరు కుటుంబాల పిల్లలకు ఉత్తమ విద్యను అందించడంతో పాటుగా జీవితంలో మెరుగైన జీవనోపాధి లబించేలా చేసేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియకుండా టీడీపీ ప్రత్యర్థులు ఆ సంస్థను ప్రైవేటు సంస్థగా పేర్కొనడం, ఆ సంస్థ ఇప్పుడే కొత్తగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కార్యకలాపాలను ప్రారంభించనుందని ఫేక్ ప్రచారం మొదలెట్టారు. అయితే ఈ దుష్ప్రచారంపై ప్రత్యర్థులు ఊహించనంత వేగంగా రియాక్ట్ అయిన టీడీపీ శ్రేణులు అసలు వాస్తవాన్ని చెబుతూ.. ఆ అసత్య ప్రచారాన్ని మొదలెట్టిన వారిని చెడుగుడు ఆడుకుంటున్నారు.
Must Read ;- ఈ సారి అవంతి వంతు!.. రచ్చ రంబోలా!











