Nara Lokesh Launches A New App For TDP Cadre :
నారా లోకేశ్.. నాలుగు దశాబ్దాల ప్రస్థానానికి దగ్గరైన తెలుగు దేశం పార్టీకి జాతీయ కార్యదర్శి మాత్రమే కాదు.. ఆ పార్టీ కేడర్ కు ఎప్పటికప్పుడు భరోసా నింపుతూ.. అందుకోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో కొంగొత్త ప్రయోగాలు చేస్తున్న నూతన తరం నేత. పార్టీ కార్యకర్తల సంక్షేమం అన్న మాట గురించి తొలిసారిగా మాట్లాడిన నేత కూడా లోకేశేనని చెప్పాలి. ఇక పార్టీ కార్యకర్తలు ఏదేని ప్రమాదాలకు లోనైతే.. వారి కుటుంబాలు దిక్కు లేనివిగా మారొద్దన్న సుదూర ఆలోచన చేయగలిగిన నేతగా నారా లోకేశ్ రికార్డుల్లోకెక్కారు. ఈ సరికొత్త చర్యలో భాగంగా పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలందరినీ ఏకమొత్తంగా బీమా చేయించిన లోకేశ్.. నిజంగానే ఏ పార్టీ నేతకు దక్కనంత గుర్తింపు దక్కించుకున్నారు. ఈ తరహాలో పార్టీ కార్యకర్తల సంక్షేమం, వారికి బీమా గురించిన పార్టీ గానీ, పార్టీ నేత గానీ అప్పటిదాకా ఎవరూ లేరనే చెప్పాలి. ఇక పార్టీ సభ్యత్వ నమోదును కొత్త పుంతలు తొక్కించిన లోకేశ్.. దేశంలోనే అత్యధిక మంతి క్రియాశీల కార్యకర్తలు కలిగిన పార్టీగా టీడీపీకి గుర్తింపు తెచ్చారు.
లోకేశ్ కొత్త ప్రయోగం
ఇలాంటి క్రమంలో పార్టీ విపక్షంలో ఉండటం, ఏపీలోని జగన్ సర్కారు టీడీపీ కేడర్ పై తనదైన శైలిలో విరుచుకుపడుతుండటం, ఈ దాడుల్లో టీడీపీ కేడర్ తీవ్ర గాయాల పాలు అవుతున్న తీరుపై కాస్తంత లోతుగానే ఆలోచించిన నారా లోకేశ్.. పార్టీ కేడర్‌కు మరింత భరోసా ఇచ్చేలా ఓ నూతన ప్రయోగానికి తెర తీశారు. అదే.. ఐటీడీపీ యాప్. అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యాప్ లో ఎవరైనా చేరవచ్చు. ప్రజా సమస్యలతో పాటు పార్టీకి సంబంధించిన ఏ విషయాన్ని అయినా షేర్ చేయవచ్చు. పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్నింటికీ మించి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు.. లేదంటే ఇతర పార్టీల నుంచి దాడులు ఎదురైతే.. యాప్ లో పేర్కొన్న వాట్సాప్ నెంబర్ కు సమాచారం చేరవేయవచ్చు. ఇలా చేయడంతో ఆయా కార్యకర్తలకు పార్టీ నుంచి తక్షణమే సాయం అందేలా చూస్తారు. ఈ మాట టీడీపీ కేడర్ లో నిజంగానే నూతనోత్తేజాన్ని నింపిందనే చెప్పాలి. ప్రస్తుతం జగన్ సర్కారు దూకుడుగా వ్యవహరిస్తూ.. టీడీపీ కేడర్ పై విరుచుకుపడుతున్న తరుణంలో ఈ యాప్ ద్వారా భరోసా లభించనుందని, ఇకపై వైసీపీకి గానీ, జగన్ సర్కారుకు గానీ భయపడాల్సిన అవసరం లేదని స్వయంగా టీడీపీ కేడరే చెబుతోంది.
కేడర్ ఏమంటోంది..?
ఈ యాప్ ద్వారా లోకేశ్ కేవలం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పిలుపు ఇవ్వలేదు. రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఆయన ఓ అద్భుతమైన అవకాశం కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ దృష్టికి తీసుకువచ్చేందుకు టీడీపీ కేడరే కాకుండా ఎవరైనా ఈ యాప్ లో చేరవచ్చని లోకేశ్ పిలుపు ఇచ్చారు. ఎవరు ఫిర్యాదు చేసినా.. ప్రజకు మెరుగైన జీవితం అందించేందుకు టీడీపీ కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా లోకేశ్ చెప్పుకొచ్చారు. బలమైన కేడర్ కలిగిన పార్టీగా టీడీపీని అభివర్ణించిన లోకేశ్.. ఆ కేడర్ లో నూతనోత్తేజం నింపేలా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటామని, భవిష్యత్తులో పార్టీ కేడర్ కు మరింత వెన్నుదన్నుగా నిలిచే దిశగా సరికొత్త చర్యలు చేపడామని ప్రకటించారు. లోకేశ్ ఏర్పాటు చేసిన ఐటీడీపీ యాప్ పై ఇప్పుడు టీడీపీ కేడర్ హర్షాతిరేకం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ యాప్‌కు కేడర్ నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. అందుకనుగుణంగా పార్టీ నుంచి కేడర్ కు మరింత భరోసా దక్కుతోంది.
Must Read ;- నారా లోకేశ్.. పీకేకు ఆదర్శంగా నిలిచారు