అక్కినేని వారి వారసుడు నాగచైతన్య బిఫోర్ లాస్టియర్ ‘వెంకీ మామ, మజిలీ’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీలో సాయిపల్లవితో జోడీ కట్టాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. లాస్ట్ ఇయరే విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కు కరోనా తీవ్రంగా అంతరాయం కలిగించింది. ఎట్టేకేలకు ఈ సినిమాను ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చారు మేకర్స్.
ఇక చైతూ.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే ఓ వెరైటీ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లింది. ప్రస్తుతం అబిడ్స్ లోని రామకృష్ణా సినిమా హాల్లో .. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కథాంశం ప్రకారం ఇందులో చైతూ పేరు అభిరామ్ అట. అంతేకాదండోయ్.. ఇతగాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్స్ కు ప్రెసెడెంటట కూడా. నాగచైతన్య సినిమాలో ఈ పాత్రతోనే బాగా ఎలివేట్ అవుతాడట.
శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న థాంక్యూ మూవీ కి యస్.యస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకు ముందు అక్కినేని ఫ్యామిలీకి మనం అనే మెమరబుల్ మూవీ గిఫ్ట్ గా ఇచ్చిన విక్రమ్ కె కుమార్ ఈ సినిమాతో మరోసారి సూపర్ హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. మరి థాంక్యూ సినిమా నాగచైతన్యకి ఏ రేంజ్ ఇమేజ్ తీసుకొస్తుందో చూడాలి.
Must Read ;- గోవాలో చైతూతో సామ్ రొమాంటిక్ జూమ్











